రాళ్లతో రాత్రిని మెరిపిద్దాం!

ఆకాశంలోని నక్షత్రాలు ముంగిట్లో దీపాలై మెరిస్తే? టీపాయిపై వాజ్‌లోని నీళ్లు చీకట్లోనూ మెరుపులు కురిపిస్తే.. భలే ఉంటుంది కదా! రంగు రాళ్లతో ఈ మ్యాజిక్‌ చేసి రాత్రి పూట కూడా ఇంటిని మెరిపించేయండి.

Published : 25 Nov 2023 02:14 IST

ఆకాశంలోని నక్షత్రాలు ముంగిట్లో దీపాలై మెరిస్తే? టీపాయిపై వాజ్‌లోని నీళ్లు చీకట్లోనూ మెరుపులు కురిపిస్తే.. భలే ఉంటుంది కదా! రంగు రాళ్లతో ఈ మ్యాజిక్‌ చేసి రాత్రి పూట కూడా ఇంటిని మెరిపించేయండి..

నీలం, ఎరుపు, ఊదా, పసుపు.. ఇలా వివిధ వర్ణాల్లో కనిపించే కలర్‌ స్టోన్స్‌ ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. చీకట్లోనూ మెరవడమే వీటి ప్రత్యేకత. పడకగదిలోని ఫ్లవర్‌వాజ్‌లో కాసిని నీళ్లు పోసి నీలిరంగు రాళ్లను కొన్నింటిని వేసి చూడండి. చీకట్లోనూ పూలకూజా మెరుపులీనుతూ గదిని ప్రత్యేకంగా మారుస్తుంది. వీకెండ్‌లో ఈ ప్రయోగం చేయండి. పిల్లల దగ్గర మంచి మార్కులు కొట్టేయొచ్చు. ముందుగదిలో ఇండోర్‌ ప్లాంట్లు ఉంటే వాటి మొదట్లో ఆకుపచ్చ, లేత పసుపు రంగు రాళ్లను సర్దేయండి. రాత్రి పూట అవి మెరుస్తూ కనిపిస్తాయి. బెడ్‌లైట్‌ బదులుగా వాడుకోవచ్చు.

తోటలో..

దారికి ఇరువైపులా మొక్కలు పెంచారా? అయితే రెండువైపులా ఈ రాళ్లను సర్దేయండి. అలాగే తొట్టెల మధ్యలో రంగురంగు రాళ్లను చల్లినట్లుగా అక్కడక్కడా సర్దితే చాలు. రాత్రి వేళల్లో ఈ దారంతా మెరుస్తూ కనిపిస్తుంది. ఆకాశంలోని నక్షత్రాలు కిందకొచ్చాయా అనిపిస్తాయి. కొత్తగా పెళ్లైన జంట ఓ సరదా సాయంత్రాన్ని ఇలా ప్లాన్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్