నీళ్ల బాటిల్‌ వాసనొస్తోందా!

మనం తరచూ వాడే స్టీల్‌ వాటర్‌ బాటిళ్లు కొన్ని రోజులకి దుర్వాసన వస్తుంటాయి. మంచినీటిని తాగాలన్నా అవీ వాసనే. వీటిని శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలున్నాయి.

Published : 25 Nov 2023 02:17 IST

మనం తరచూ వాడే స్టీల్‌ వాటర్‌ బాటిళ్లు కొన్ని రోజులకి దుర్వాసన వస్తుంటాయి. మంచినీటిని తాగాలన్నా అవీ వాసనే. వీటిని శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలున్నాయి..

  • టీ డికాక్షన్‌ కాచి.. దాన్ని బాటిల్లో వేసి, మూతపెట్టి బాగా షేక్‌ చేయాలి. చివరగా బ్రష్‌తో లోపల, మూతపెట్టే అంచుల దగ్గర రుద్దితే వాసనలు పోతాయి.
  • నిమ్మరసం దీనికి చక్కని పరిష్కారం. అర చెక్క నిమ్మరసాన్ని సీసాలో పిండి, తగినన్ని నీళ్లు పోసి బాగా కదపాలి. లేదంటే బాటిల్‌లో వేడినీళ్లు, కొన్ని నిమ్మతొక్కలు వేసి బాగా కదిపి చూడండి. దుర్వాసన ఉంటే పోతుంది.
  • బేకింగ్‌ సోడాను ఉపయోగించి కూడా బాటిల్‌ మురికి, వాసనను దూరం చేయవచ్చు. టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌సోడాను సీసాలో వేసి నిండా నీటిని నింపాలి. మరుసటిరోజు ఉదయం ఆ నీళ్లు వంపేసి బాటిల్‌ శుభ్రం చేస్తే సరి. చిన్నపిల్లలు మంచినీళ్లు నోటికి దగ్గరగా ఉంచి తాగుతారు. అందుకే వాళ్ల సీసాని రోజూ శుభ్రం చేయాల్సిందే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్