చిన్నదైనా.. చక్కగా!

ఇంటిని అందంగా పెట్టుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? మాది పెద్ద ఇల్లు కాదు. అందుకే నచ్చినట్టుగా సర్దుకోలేకపోతున్నా.. అంటూ వాపోతుంటారు కొందరు గృహిణులు.

Published : 27 Nov 2023 01:28 IST

ఇంటిని అందంగా పెట్టుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? మాది పెద్ద ఇల్లు కాదు. అందుకే నచ్చినట్టుగా సర్దుకోలేకపోతున్నా.. అంటూ వాపోతుంటారు కొందరు గృహిణులు. ఈ నియమాలు పాటించండి. ఇల్లు చిన్నదైనా అందంగా, పొందిగ్గా కనిపిస్తుంది.

పెద్దవి వద్దు.. ఇంటిని మరీ మూసేసినట్లుగా అనిపించే పెద్ద కర్టెన్లను వాడకండి. ఇవి ఇరుకైన భావనని కలిగిస్తాయి. బదులుగా తేలికపాటి మెష్‌ లేదా బ్లైండ్స్‌ను పెట్టించుకోండి. తక్కువ బరువు, లేత రంగుల కర్టెన్లను ఎంచుకున్నా మంచిదే. దుమ్మూ, ధూళి దరిచేరదు మనసుకీ ప్రశాంతతనిస్తాయి. 

లేతవే మేలు.. గోడలకు తెలుపు, లేత గోధుమ వంటి తేలిక రంగులను ఎంచుకోండి. ఇవీ ఇల్లు విశాలంగా కనిపించేలా చేస్తాయి. అలానే బెడ్‌రూమ్‌లో మంచం పెద్దగా, ఆర్భాటంగా ఉండొద్దు. ఇది గదిని ఇరుకుగా కనిపించేలా చేస్తుంది. బదులుగా సింపుల్‌ డిజైన్‌వి ఎంచుకోండి. క్లాసీ లుక్‌ రావడమే కాదు.. గది కూడా విశాలంగా కనిపిస్తుంది.

తక్కువే అందం.. ఇంటి అందాన్ని పెంచేయాలని కనిపించిన ప్రతిదీ కొనొద్దు. కొందరు ఎక్కడికైనా వెళితే ఆ ప్రాంతానికి గుర్తు అంటూ తెచ్చేస్తుంటారు. ఇల్లంతా గజిబిజిగా మారడం మినహా ప్రయోజనం ఉండదు. కొనేముందు కచ్చితంగా అవసరమేనా అని గమనించుకోండి. కొన్నాక ఎక్కడ పెట్టొచ్చు అన్నదీ ఆలోచించుకోండి. అప్పుడు కుప్పగా ఏర్పడే ఆస్కారం ఉండదు. చోటూ కలిసొస్తుంది. అలానే కొన్నైనా పెద్ద అద్దాలు ఉంచడానికి ప్రయత్నించండి. ఇవి కూడా ఎక్కువ చోటు ఉన్న భావనని కలిగిస్తాయి. ఇలా కొంచెం పొదుపుగా ఆలోచిస్తే చాలు.. ఇల్లూ పొందికగా అనిపిస్తుంది. ప్రశాంతతా కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్