మొబైల్‌ వెనక దాస్తున్నారా?

చీరలు, కుర్తీలకు జేబులుండవు. అస్తమానూ పర్సు వెంట తీసుకెళ్లడమూ కష్టమే. అందుకే అత్యవసరాల్లో పనికొస్తాయి అని మొబైల్‌ వెనుక డబ్బులు, కార్డులు వగైరా పెడుతుంటాం.

Updated : 06 Dec 2023 12:44 IST

చీరలు, కుర్తీలకు జేబులుండవు. అస్తమానూ పర్సు వెంట తీసుకెళ్లడమూ కష్టమే. అందుకే అత్యవసరాల్లో పనికొస్తాయి అని మొబైల్‌ వెనుక డబ్బులు, కార్డులు వగైరా పెడుతుంటాం. కానీ అది ప్రమాదమని తెలుసా? ఎలాగంటే..

  • కొద్దిగా ఎక్కువసేపు ఫోన్‌ వాడాక అది వేడెక్కడం గమనిస్తుంటాం కదా! ఆ ప్రభావం కనిపించేది మొబైల్‌ వెనుక వైపే! అలాంటప్పుడు కరెన్సీ, షాపింగ్‌ బిల్లులు వంటివి ఉంటే మంటలు రేగే ప్రమాదం ఉంది. అదీకాక డబ్బులు తయారు చేసే పదార్థం మంటలను వేగంగా ఆకర్షిస్తుంది. ఒక్కోసారి పేలుళ్లూ సంభవించొచ్చు.
  •  కార్డులు మాత్రం సురక్షితమన్న అపోహ వద్దు. వీటి మీద మాగ్నెటిక్‌ స్ట్రిప్స్‌ ఉంటాయి. వీటిని మొబైల్‌ వెనకపెడితే డీమాగ్నటైజ్‌ అవుతాయి. దీంతో అవి పని చేయకుండా పోయే అవకాశమూ లేకపోలేదు.
  • ఫోన్‌ రక్షణ కోసమని మందమైన, ఆకర్షించే కవర్లను వేస్తుంటాం. వాటినీ మరీ బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి. ఇవి వేడిని బయటకు పోనివ్వవు దీంతో ఒత్తిడి పెరిగి మొబైళ్లు పేలే ప్రమాదం ఉంది. కాబట్టి, వీలైనంత వరకూ ఫోను వెనుక భాగం పూర్తిగా కప్పేయకుండా చూసుకోవడం మంచిది.
  • ఇవే కాదు వ్యక్తిగతంగానూ కొన్ని జాగ్రత్తలు అవసరమే. ఆటలు, వినోదం అంటూ మొబైళ్లను తెగ వాడేస్తున్నాం. వాడకం పెరిగే కొద్దీ దానిలోని ప్రాసెసర్‌ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అయినా ఉపయోగిస్తోంటే ఆ ప్రభావం మనపైనా పడుతుంది. తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి, చెవులు దెబ్బతినడం లాంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ఫోన్‌ మాట్లాడేప్పుడు ఇయర్‌ ఫోన్లు వాడటం, కాస్త వేడెక్కగానే పక్కన పెట్టేయడం వంటివి తప్పక చేస్తేనే సురక్షితం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్