ఇంటి మొక్కకు.. మంచి మట్టి!

మన ఆహారంలో పోషకాలు ఉండేట్టు జాగ్రత్త పడతాం. వాతావరణానికి తగ్గట్టుగా ఇంటిని మార్చుకొని సౌకర్యంగా ఉంటాం. అలాగే ఇండోర్‌ మొక్కలను కూడా పరిరక్షిస్తే పదేళ్లపాటు మనింటిని పచ్చగా, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Published : 01 Dec 2023 01:49 IST

మన ఆహారంలో పోషకాలు ఉండేట్టు జాగ్రత్త పడతాం. వాతావరణానికి తగ్గట్టుగా ఇంటిని మార్చుకొని సౌకర్యంగా ఉంటాం. అలాగే ఇండోర్‌ మొక్కలను కూడా పరిరక్షిస్తే పదేళ్లపాటు మనింటిని పచ్చగా, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ మొక్కలకు ఎరువునెలా సిద్ధం చేయాలో తెలుసుకుందాం.

సాధారణంగా ఇండోర్‌ మొక్కలనగానే వాటికి తగిన వెలుతురు, నీటి సౌకర్యాన్ని మాత్రమే అందిస్తుంటాం. అయితే మట్టి మిక్సింగ్‌ కూడా చాలా ముఖ్యం. మూడు రకాల మట్టితో తొట్టెను నింపాల్సి ఉంటుంది. మొదటిది సాధారణ మట్టి. ఇది మొక్క వేర్లు బలంగా లోపలికి చొచ్చుకుపోయేందుకు సహకరిస్తుంది. ఇక రెండోది కోకోపీట్‌. ఇది మొక్కకు తేమను అందిస్తుంది. చివరిది సేంద్రియ ఎరువు. ఇది మొక్క ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

కోకోపీట్‌, సేంద్రియ ఎరువు, మామూలు మట్టి.. వీటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపితే సాయిల్‌ మిక్స్‌ రెడీ. తొట్టెలో ఈ సాయిల్‌మిక్స్‌ను ఒక వంతు వేసి గట్టిగా ఒత్తాలి. ఆపైన మరో మూడొంతుల సాయిల్‌ మిక్స్‌ని వదులుగా వేయాలి. ఆ తర్వాత మొక్కను నాటి, పైన కాస్తంత మిక్స్‌ని చల్లితే చాలు. సీజన్‌బట్టి నీటిని అందిస్తుండాలి. కాక్టస్‌ జాతికి చెందిన ఇండోర్‌ మొక్కలకు వారానికోసారి నీరు పోస్తే సరిపోతుంది.

పోషకాలు పోకుండా..

మొక్క రకాన్ని బట్టి, అలాగే వాతావరణానికి తగ్గట్టుగా సరిపడినంత నీటిని మాత్రమే అందించాలి. లేదంటే పోషకాలన్నీ అదనపు నీటిలో కలిసి బయటకు పోయే అవకాశం ఉంటుంది. అలాగే నెలకు రెండు సార్లు తొట్టెలోని మట్టిని వదులు చేస్తుండాలి. అయితే తొట్టె పైభాగంలో మాత్రమే మట్టిని వదులుచేయాలి. ఇలా చేయకపోతే మట్టి గట్టిపడి, మొక్కకు అందించే నీరు వేర్ల వరకు చేరదు. అలాగే గట్టిపడిన మట్టి ప్రతిబంధకంగా మారి వేర్లకు ఆక్సిజన్‌ అందనివ్వదు. దీంతో మొక్క ఎదుగుదల తగ్గడమే కాదు, చనిపోయే ప్రమాదమూ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్