బాల్కనీలో గడ్డి బంతులు...

ఈ మొక్కలు చూడ్డానికి భలే చిత్రంగా ఉంటాయి. కుండీలుకానీ, మట్టిగానీ కనిపించదు. చక్కగా బాల్కనీలో వేలాడుతూ కనిపిస్తాయి. వీటినే మాస్‌బాల్స్‌ అంటారు. వీటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు.

Published : 03 Dec 2023 01:43 IST

ఈ మొక్కలు చూడ్డానికి భలే చిత్రంగా ఉంటాయి. కుండీలుకానీ, మట్టిగానీ కనిపించదు. చక్కగా బాల్కనీలో వేలాడుతూ కనిపిస్తాయి. వీటినే మాస్‌బాల్స్‌ అంటారు. వీటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు..

మట్టి కుండల్లో: చిన్నచిన్న మట్టి పిడతలు లేదా కుండలు నాలుగైదు తీసుకొని పైభాగాన రెండు వైపులా వేలాడదీయడానికి వీలుగా రింగ్స్‌లాంటివి అమర్చుకోవాలి. వీటిని కాసేపు నీటిలో నాననివ్వాలి. మట్టి, కోకోపీట్‌ని సమానభాగాలుగా తీసుకుని బాగా కలిపితే ముద్దలా అవుతుంది. నీటిలో ఉంచిన కుండలను తీసుకుని ఈ మట్టి ముద్దను అన్నివైపులా అంటుకొనేలా గట్టిగా ఒత్తాలి. అది తడిగా ఉన్నప్పుడే పలుచని జనపనార సంచి ముక్కను పరిచి, అది కదలకుండా దారంతో కట్టేయాలి. త్వరగా అల్లుకొనే స్టార్‌ గ్రాస్‌, టేబుల్‌ రోజ్‌వంటి రకాల్ని చిన్నచిన్న కొమ్మలుగా కత్తిరించి జనపనార సంచి రంధ్రాల్లోంచి మట్టిలోకి వెళ్లేలా గుచ్చాలి. కుండకి తాళ్లు కట్టి పైనుంచి వేలాడదీయాలి. కుండలో కాసిని నీళ్లు పోసినా, పైన చిలకరించినా చాలు. ఈ గడ్డి పెరుగుతూ.. పచ్చని బంతుల్లా మారి చూడచక్కగా ఉంటాయి.

మెష్‌ బ్యాగులో..

కుండకు బదులు... సన్నగా ఉండే ఇనుపతీగల మెష్‌తోనూ ఈ మాస్‌బాల్‌ని తయారుచేయొచ్చు. మెష్‌తో తొట్టెలా చేసి తాళ్లతో దాన్ని బాల్కనీలో వేలాడదీసేందుకు వీలుగా ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కోకోపీట్‌తో, మట్టి కలిపిన మిశ్రమంతో నింపి మనీప్లాంట్‌ లేదా నచ్చిన ఇండోర్‌ప్లాంట్‌ కొమ్మలను చుట్టూ నాలుగువైపులా గుచ్చాలి. ఇలా తయారుచేసిన బంతులను బాల్కనీలో వరసగా వేలాడదీసి చూడండి. చూడ్డానికి పచ్చగా, కంటికింపుగా.. గాలికి ఊగుతూ అందంగా కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్