టీ గార్డెన్‌ పెంచేద్దాం..

బాల్కనీ, కిచెన్‌లో మొక్కలు పెంచడమంటే చాలామంది మహిళలకు ఇష్టం. మీరూ ఆ కోవకే చెందుతారా? అయితే ఈ టీ గార్డెన్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ పద్ధతిలో పెంచిన మొక్కల ఆకులతో చేసిన తేనీరు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.. ఉన్న కొద్దిపాటి స్థలంలో.. చిన్న చిన్న కుండీల్లో సులువుగా పెంచుకోగలిగే మొక్కల్లో రోజ్‌మెరీ...

Published : 04 Dec 2023 01:34 IST

బాల్కనీ, కిచెన్‌లో మొక్కలు పెంచడమంటే చాలామంది మహిళలకు ఇష్టం. మీరూ ఆ కోవకే చెందుతారా? అయితే ఈ టీ గార్డెన్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ పద్ధతిలో పెంచిన మొక్కల ఆకులతో చేసిన తేనీరు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది..

ఉన్న కొద్దిపాటి స్థలంలో.. చిన్న చిన్న కుండీల్లో సులువుగా పెంచుకోగలిగే మొక్కల్లో రోజ్‌మెరీ, వాము, పుదీనా, నిమ్మగడ్డి వంటివి ముందుంటాయి. అందుకే వర్టికల్‌ గార్డెన్‌లో సులువుగా పెంచుకోవచ్చు. వీటి ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నీళ్లల్లో ఈ ఆకుల్ని వేసి మరిగించి, తేనె కలిపి తాగడం వల్ల గొంతునొప్పి, జలుబు, ఫ్లూల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఆకులే కాదు... కొన్ని రకాల పూలతోనూ తేనీటిని తయారు చేసుకోవచ్చు. వాటిల్లో గులాబీ, మందార, చామంతి, బంతి, శంఖు పూల వంటివెన్నో ఉంటాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల అజీర్తి, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటివి అదుపులో ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.  

తాజా ఆకులూ, పూలతో.. పాటు వీటిని పాక్షికంగా నీడలో ఆరనిచ్చి, పొడి చేసి గాజు సీసాల్లో భద్రపరుచుకునీ టీ చేసుకోవచ్చు. వీటికి దాల్చినచెక్క, మిరియాలు, వంటివి చేర్చి కొత్తరుచుల్లో తేనీటిని ఆస్వాదించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్