గోడలపై.. వెన్నెల!

రోజంతా పడిన శ్రమను మరవాలంటే ఆదమరిచి నిద్ర పోవడం తప్పనిసరి. కానీ అది దరిచేరాలంటే.. నిద్రించే ప్రదేశం ఇంకెంత ప్రశాంతంగా ఉండాలి? అలా మనసుకు ఆహ్లాదం కలిగించేలా పడకగదిని ఎలా తీర్చిదిద్దాలా అని ఆలోచిస్తున్నారా? ఈ సూచనలు.. మీకోసమే!

Published : 05 Dec 2023 01:25 IST

రోజంతా పడిన శ్రమను మరవాలంటే ఆదమరిచి నిద్ర పోవడం తప్పనిసరి. కానీ అది దరిచేరాలంటే.. నిద్రించే ప్రదేశం ఇంకెంత ప్రశాంతంగా ఉండాలి? అలా మనసుకు ఆహ్లాదం కలిగించేలా పడకగదిని ఎలా తీర్చిదిద్దాలా అని ఆలోచిస్తున్నారా? ఈ సూచనలు.. మీకోసమే!

పచ్చదనం.. పక్షులు.. మంచానికి వెనకవైపు ప్రకృతిని తలపించేలా పచ్చని చెట్లు, పక్షులు, రంగుల పూలతో కూడిన పెయింటింగ్‌ వేయించండి. ప్రకృతే మన చెంతకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. మిగతా గోడలకి లేత రంగులు వేస్తే చాలు. ఆకుపచ్చ రంగుకి ఒత్తిడిని దూరం చేసే గుణముంది. ఈ అమరికకు తగ్గ బెడ్‌షీట్స్‌ ఉంటే చాలు.. గది ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

 వాల్‌ ఆర్ట్‌తో.. వెన్నెల్లో.. ఆరుబయట మంచం వేసుకొని చుక్కలను లెక్కిస్తూ కబుర్లు చెప్పుకోవడం.. ఎంత అందమైన అనుభూతి. ఆ వెన్నెల అందాల్ని మీ బెడ్‌రూమ్‌కి తెచ్చేయండి. రంగుల ఎంపిక, మంచి ఆర్టిస్ట్‌ను వెతకడం శ్రమ అనుకుంటే.. రెడీమేడ్‌ వాల్‌ ఆర్ట్‌ తెచ్చుకుంటే సరి. అదనంగా మంచానికి ఇరువైపులా పొడవైన ఇండోర్‌ప్లాంట్స్‌ వంటివి సర్దితే చూడటానికి సహజంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలీ సొంతం. వీటిమధ్య నిద్రకు చేరితే ప్రతి ఉదయమూ ఉత్సాహంగా మారడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్