ఇండోర్‌ మొక్కలు పచ్చగా ఉండాలంటే..

ఇండోర్‌ మొక్కలని ఏ మూల ఉంచినా అందంగానే అనిపిస్తాయి. లోపలి వాతావరణాన్ని కాలుష్యరహితంగా మారుస్తాయి. ఇంత మేలు చేసే వీటి ఎదుగుదలపై మనం శ్రద్ధ పెట్టకపోతే ఎలా? అందుకే ఈ చిట్కాలు.

Published : 06 Dec 2023 01:53 IST

ఇండోర్‌ మొక్కలని ఏ మూల ఉంచినా అందంగానే అనిపిస్తాయి. లోపలి వాతావరణాన్ని కాలుష్యరహితంగా మారుస్తాయి. ఇంత మేలు చేసే వీటి ఎదుగుదలపై మనం శ్రద్ధ పెట్టకపోతే ఎలా? అందుకే ఈ చిట్కాలు..

  • ఇంటిలోపల పెంచుకోగలిగే చాలా రకాల మొక్కలకు సంరక్షణ అవసరం తక్కువే అయినా మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. అలాగని నీళ్లు ఎక్కువైతే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసి... మొక్క ఎదుగుదలకు ఆటంకంగా మారతాయి. అలాంటప్పుడు.. గాల్లోకి నీటిని స్ప్రే చేయడం, కుండీ అడుగున ఉంచే ట్రేలో గులకరాళ్లను పేర్చి అందులో నీటిని పోయడం, ఆకులపై పేరుకున్న దుమ్ముని తడి వస్త్రంతో తుడవడం వంటివాటి వల్ల కూడా తగినంత తేమని అందించొచ్చు.
  • ఆకులు రంగు మారినా, పెరుగుదల కనిపించకపోయినా, రాలిపోతున్నా నీళ్లు ఎక్కువ అవుతున్నాయని అర్థం. అప్పుడు రోజు విడిచి రోజు అందివ్వడం, కొంతకాలం మొక్కను పాక్షికంగా ఎండ తగిలే ప్రదేశంలోకి మార్చడం మంచి పరిష్కారం.
  • మొక్కల్ని ఎండతగిలే చోటే ఉంచాల్సిన అవసరమే లేదు. బాగా వెలుతురున్న చోట ఉంచినా చాలు. కొన్ని మొక్కలను ఫ్లోరోసెంట్‌ దీపాల కింద పెట్టినా సరిపోతుంది.
  • మట్టి సారవంతంగా ఉన్నప్పుడే ఇండోర్‌ ప్లాంట్స్‌ పచ్చగా నిగనిగలాడతాయి. ఇందుకోసం 10:10:10 నిష్పత్తిలో ఎన్‌పీకే సమగ్ర ఎరువుని అందించాలి. ఏడాదికోసారైనా మట్టిని మార్చడం, కొత్త పోషకాలను జోడించడం వంటివి చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్