గోడపై మరకలా...

చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారన్న సంగతి వేరెవరో చెప్పనక్కర్లేదు. ఇంట్లోని గోడలే చెప్పేస్తాయి. వారి సృజనాత్మకతను ప్రదర్శించే ప్రదేశాలవే మరి. కొన్నిసార్లు మన పొరపాట్లూ ఇందుకు కారణమే. పోగొట్టాలా.. ఈ చిట్కాలు పాటించేయండి.

Published : 06 Dec 2023 01:58 IST

చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారన్న సంగతి వేరెవరో చెప్పనక్కర్లేదు. ఇంట్లోని గోడలే చెప్పేస్తాయి. వారి సృజనాత్మకతను ప్రదర్శించే ప్రదేశాలవే మరి. కొన్నిసార్లు మన పొరపాట్లూ ఇందుకు కారణమే. పోగొట్టాలా.. ఈ చిట్కాలు పాటించేయండి.

  • బుడతల చేతికి పెన్ను, పెన్సిల్‌ దొరికాయంటే చాలు.. గోడ మీద గీసేస్తుంటారు. తడి వస్త్రంతో తుడిచినా అవి వదలవు. ఈసారి నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ ప్రయత్నించండి. ఓ వస్త్రంపై కొద్దిగా చల్లి, నెమ్మదిగా తుడిస్తే చాలా వరకూ తొలగుతాయి.
  • స్కెచ్‌ గీతలైతే.. బేకింగ్‌ సోడాకు కొన్ని నీళ్లు చేర్చి, మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గీతలపై రాసి, అయిదు నిమిషాలు ఆగాలి. తర్వాత మెత్తని వస్త్రంతో నెమ్మదిగా తుడిచేస్తే సరిపోతుంది.
  • వంటలో ఉపయోగించే వెనిగర్‌ పెయింట్‌ మరకలను తొలగించడానికి సాయపడుతుంది. డ్రాయింగ్‌ పెయింట్లు, వాటర్‌ కలర్స్‌ వగైరా గోడలపై పడితే దీన్ని ఉపయోగించొచ్చు. ఒక పాత్రలో వెనిగర్‌, నీటిని సమపాళ్లలో తీసుకోవాలి. అందులో స్పాంజి లేదా క్లాత్‌ను ముంచి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. పావుగంట తర్వాత తడి వస్త్రంతో తుడిచేస్తే చాలు. మరకలు తొలగుతాయి.
  • తినేప్పుడు ఇల్లంతా మెతుకులు, కూరలు పడేస్తుంటారు. నేలమీదవైతే తేలిగ్గానే శుభ్రం చేస్తాం. గోడల మీదవే కష్టం. అలాంటప్పుడు ముందు తడి వస్త్రంతో తుడిచేయాలి. ఆపై, పాత్రలు కడగడానికి వాడే డిష్‌వాష్‌ లిక్విడ్‌ను మరకలున్న చోట రాసి, పది నిమిషాలు వదిలేయాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే చాలావరకూ ఫలితం ఉంటుంది. నిమ్మచెక్కకు ఉప్పు అద్ది, నెమ్మదిగా రుద్ది మరకలను దూరం చేయొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్