మొక్క సంగతి.. మర్చిపోండిక!

ఇంట్లో.. టేబుల్‌ మీదా.. పచ్చగా ఎదుగుతున్న మొక్క ఉంటే ఎంత అందమో కదా! ఒత్తిడీ క్షణాల్లో దూరమవుతుంది. అందుకే ఇండోర్‌ మొక్కల మీద దృష్టిపెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Published : 07 Dec 2023 01:31 IST

ఇంట్లో.. టేబుల్‌ మీదా.. పచ్చగా ఎదుగుతున్న మొక్క ఉంటే ఎంత అందమో కదా! ఒత్తిడీ క్షణాల్లో దూరమవుతుంది. అందుకే ఇండోర్‌ మొక్కల మీద దృష్టిపెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీటికి పెద్ద సంరక్షణా అవసరం ఉండదు. అడపాదడపా నీరందిస్తే చాలు. పనిలో పడి వాటిని పట్టించుకోవడం మర్చిపోయినా.. తొందరలో ఎక్కువ నీరందించినప్పుడే సమస్య. దాన్నీ సులభతరం చేస్తూ వచ్చినవే ఈ సెల్ఫ్‌ వాటరింగ్‌ పాట్స్‌. కింది పాత్రలో ఉంచిన నీటిని మొక్కే తనకు అవసరమైనప్పుడల్లా తీసుకుంటుంది. భిన్నరకాల్లో ఇంటికీ ప్రత్యేక అందాన్ని తెస్తున్నాయి. వీటిని తెచ్చుకోండి.. మొక్కల చింతను మర్చిపోవచ్చు. భలే ఉందే అమరిక అనిపిస్తే.. ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్