ఏ సమయంలో తింటే మంచిది?

ఇంటి పనుల కారణంగా ఉదయం అల్పాహారం 11 గంటలకి, మధ్యాహ్న భోజనం మూడు గంటలకి చేస్తున్నా.. ఈ మధ్య నాకు ఛాతీలో మంట వస్తోంది.

Published : 08 Feb 2024 17:04 IST

ఇంటి పనుల కారణంగా ఉదయం అల్పాహారం 11 గంటలకి, మధ్యాహ్న భోజనం మూడు గంటలకి చేస్తున్నా.. ఈ మధ్య నాకు ఛాతీలో మంట వస్తోంది. దానికి కారణం ఆలస్యంగా తినడమేనా? అదే అయితే... ఏ సమయంలో తినడం మంచిదో చెప్పగలరు.

లావణ్య, తిరుపతి

సిడిటీ వల్ల అలా వస్తుండవచ్చు. ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం లేదా పొట్టలో హెచ్‌ పైలొరీ అనే బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌...ఇలా ఎసిడిటీకి బోలెడు కారణాలు. అంతేకాకుండా, అన్నవాహిక దగ్గర ఉండే చిన్న కండరం వదులుగా అయినప్పుడు జీర్ణకోశంలో ఉండాల్సిన ద్రవాలు గొంతులోకీ నోట్లోకీ చేరుతాయి. దాని కారణంగానూ ఎసిడిటీ లక్షణాలు కనిపిస్తుంటాయి. పైగా అందరి జీవనశైలి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఎప్పుడు నిద్రలేస్తారు.. ఏం పని చేస్తారు.. ఏ ఆహారం తీసుకుంటారు... ఎంత మోతాదులో తింటారు... ఇవన్నీ కూడా మీ జీర్ణకోశ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మాంసాహారం, నూనెతో చేసిన పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పైగా ఇవి అధిక ఆమ్లాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అంతేకాదు, కొంతమందికి అన్ని రకాల మసాలాలు పడకపోవచ్చు, అలాగే ఎండుమిర్చి, మిరియాలు, కారం, చింతపండు వంటివాటివల్ల కూడా ఎసిడిటీ వస్తుంది. ఇవేవీ కాకుంటే హెచ్‌ పైలొరీ ఇన్‌ఫెక్షన్‌ ఉండి ఉండొచ్చు కాబట్టి ఒకసారి వైద్యుల్ని సంప్రదించండి. దీంతోపాటు రోజూ ఓ అరగంట నడక లేదా వ్యాయామం అలవాటు చేసుకోండి. ఉదయం ఆరుగంటలకు లేచి తొమ్మిదికల్లా అల్పాహారం, ఒంటి గంటకి భోజనం, సాయంత్రం నాలుగు నుంచి ఐదు లోపు ఓట్స్‌ జావ, ఫ్రూట్స్‌, నట్స్‌, వంటివి తీసుకోవాలి. రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్యలో రాత్రి భోజనం చేయండి. ఆలస్యంగా తినడం, ఒక పూట మానేయడం చేయకుండా, తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి. ఈ విధంగా ఆహారంలో మార్పులు చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్