అమ్మతనానికి ‘ప్లాస్టిక్‌’ అడ్డు!

ఐస్‌క్రీమ్‌, బిర్యానీలకు వచ్చిన ప్లాస్టిక్‌ డబ్బాల్లో చింతపండు, కొత్తిమీర, కరివేపాకు... లాంటివి ఉంచటం మనలో కొందరికి అలవాటే. అయితే ఇవి మహిళల్లో అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయని మీకు తెలుసా!

Published : 12 Feb 2024 01:14 IST

ఐస్‌క్రీమ్‌, బిర్యానీలకు వచ్చిన ప్లాస్టిక్‌ డబ్బాల్లో చింతపండు, కొత్తిమీర, కరివేపాకు... లాంటివి ఉంచటం మనలో కొందరికి అలవాటే. అయితే ఇవి మహిళల్లో అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయని మీకు తెలుసా!

ప్లాస్టిక్‌ డబ్బాల తయారీకి వినియోగించే రసాయనాల్లో హానికర రసాయనాలైన బీపీఏ, థాలేట్ల వంటివి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరుని దెబ్బతీసి, హార్మోన్ల ఉత్పత్తికి అడ్డుపడతాయి. ఫలితంగా మహిళల్లో సంతాన సంబంధిత సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. మనం వాడే లోషన్లూ, షాంపూలూ,  నెయిల్‌ పాలిష్‌లూ, కాస్మెటిక్స్‌, రూమ్‌ ఫ్రెష్‌నర్లు, పరిమళ ద్రవ్యాల్లోనూ థాలేట్లు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్‌ స్థాయులను తగ్గించి, గర్భధారణ సమయంలో అధిక బరువుకూ, కొన్ని పరిస్థితుల్లో  గర్భస్రావాలకూ కారణమవుతాయి. మనం ఉపయోగించే ప్లాస్టిక్‌ బాటిళ్లు, సన్‌గ్లాసెస్‌, హెల్మెట్లలో ఉండే బీపీఏ... పీసీఓఎస్‌కు కారణమై సంతానలేమి సమస్యలను తెచ్చిపెడుతోంది. పీసీఓఎస్‌ ఉన్న కొందరు మహిళల శరీరాల్లో బీపీఏ స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్లాసెంటాలోనూ మైక్రో ప్లాస్టిక్‌ ఆనవాళ్లను గుర్తించారంటే... ప్లాస్టిక్‌ మన రోజూ వారి జీవితాల్లో ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని మన జీవితాల నుంచి పూర్తిగా తొలగించటం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు కానీ వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు. ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా గాజు, స్టీలు, చెక్కతో చేసినవి వినియోగించాలి. సరకుల కోసం రీయూజబుల్‌ సంచులు వాడటం, ప్యాకేజ్డ్‌ ఆహారానికి దూరంగా ఉండటం, హెయిర్‌ స్ప్రే, పర్‌ఫ్యూమ్‌లు, నెయిల్‌ పాలిష్‌ల వాడకాన్ని తగ్గించటం వీటికి బదులుగా బీపీఏ ఫ్రీ ఉత్పత్తులను వాడటం వల్ల ఈ ప్లాస్టిక్‌ భూతం నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఈ నియమాలకు మనం కట్టుబడగలిగితేనే హార్మోన్ల అసమతుల్యతను అరికట్టగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్