వాటితో శుభ్రత తేలిక!

ఇంటినెంతగా శుభ్రం చేసుకున్నా, టాయిలెట్లూ, సింకుల్ని క్లీన్‌ చేయడాన్ని మాత్రం కష్టంగా భావించేవారు చాలామందే. ఇలాంటివారి పనిని సులభం చేయడానికి మార్కెట్లోకి టాయిలెట్‌ క్లీనింగ్‌ ఫ్లోరల్‌ స్టాంప్‌ కిట్స్‌ వచ్చాయి.

Updated : 14 Feb 2024 04:28 IST

మహిళలు ఇంటి పనుల్లో ఎక్కువ శ్రమ పడేది శుభ్రత కోసమే. వాటిని సులువుగా పూర్తి చేయడానికి కొన్ని స్మార్ట్‌ టూల్స్‌ సాయం తీసుకోవాల్సిందే. అలాంటి వాటిల్లో ఇవి కొన్ని...

టాయిలెట్‌ క్లీనింగ్‌ స్టాంప్‌

ఇంటినెంతగా శుభ్రం చేసుకున్నా, టాయిలెట్లూ, సింకుల్ని క్లీన్‌ చేయడాన్ని మాత్రం కష్టంగా భావించేవారు చాలామందే. ఇలాంటివారి పనిని సులభం చేయడానికి మార్కెట్లోకి టాయిలెట్‌ క్లీనింగ్‌ ఫ్లోరల్‌ స్టాంప్‌ కిట్స్‌ వచ్చాయి. ఇందులో వివిధ రంగుల్లో ఉండే క్లీనింగ్‌ లిక్విడ్‌ జెల్‌తో పాటు పన్నెండు రకాల పూల ఆకృతుల్లో ట్యూబ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇందులో దాన్ని నింపి టాయిలెట్‌ బౌల్‌ లోపలి వైపు అక్కడక్కడా పెడితే అతుక్కుని ఉంటాయి. ఫ్లష్‌ చేసిన ప్రతిసారీ ఈ లిక్విడ్‌ దుర్వాసనను దూరం చేయడంతోపాటు టాయిలెట్‌నీ శుభ్రం చేస్తుంది. ఈ పూలు రోజు రోజుకీ రంగుని కోల్పోతూ వస్తాయి. వీటిని ఏడు రోజుల తరవాత తొలగించి మరోసారి స్టాంపింగ్‌ చేసుకుంటే సరి. ఒక్కో జెల్‌ బాటిల్‌ని రెండు నెలల పాటు వాడుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... ఒకటి తెచ్చేసుకుందాం పదండి!


రీయూజబుల్‌ క్లీనింగ్‌ మాప్‌

ఈ రోజుల్లో చాలామంది ఇళ్లు... ఎంత చిన్నగా ఉన్నా, ఫ్లోరింగ్‌కి మాత్రం టైల్స్‌ లేదా మార్బుల్‌వే వేయిస్తున్నారు. వీటిని ఒక్కరోజు తుడవకపోయినా మురికిగా కనిపిస్తాయి. అందుకే, ప్రతి ఇంట్లోనూ మాప్‌ స్టిక్‌ వాడకం తప్పనిసరైంది. కానీ, దీన్ని శుభ్రం చేయడం, ఆరబెట్టడం... మాత్రం కాస్త కష్టంగానే ఉంటోంది. అందుకే, దీనికి ప్రత్యామ్నాయంగా రీయూజబుల్‌ క్లీనింగ్‌ మాప్‌లు వచ్చేశాయి. వీటిని ఎప్పటికప్పుడు తీసి ఉతికి ఆరబెట్టుకుని మళ్లీ వాడుకోవచ్చు. మైక్రోఫైబర్‌, స్వచ్ఛమైన కాటన్‌తో చేసిన ఈ వస్త్రాలు... నీటినీ త్వరగా పీల్చుకుంటాయి. భలే ఉంది కదూ!


స్పిన్‌ డస్టర్‌

ఇల్లు దులపడానికి పండగో, ప్రత్యేక సందర్భమో అక్కర్లేదు చాలామంది మహిళలకు. రోజూ చేసే పని నుంచి కాస్త ఖాళీ దొరికితే చాలు... అదే పనిలో ఉంటారు. ఇందుకు బూజు కర్ర వాడినా బరువుకి దాన్ని అటూ, ఇటూ తిప్పడం కొన్నిసార్లు సాధ్యపడదు. ఇంకొన్నిసార్లు... మూలల్లోకి చొచ్చుకునిపోలేక దుమ్మూ అలానే ఉండిపోతుంది. అయితే, ఇప్పుడు మీకా సమస్య లేదు. బ్యాటరీ, విద్యుత్‌లతో నడిచే ఈ స్పిన్‌ డస్టర్‌ని ఎంచుకుంటే సరి. మూలలూ, కంప్యూటర్‌ కీబోర్డులూ, కప్‌బోర్డులు... ఒకటేమిటి అన్నింటినీ ఓ చిన్న బటన్‌ నొక్కి సులువుగా శుభ్రం చేసేయొచ్చు. పెద్దగా శ్రమ పెట్టక్కర్లేకుండానే దుమ్ముని వదిలించేయొచ్చు. మరి పని మొదలుపెడదామా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్