ఏవెక్కడున్నాయో తెలిసేలా...

‘టైం అవుతోంది యూనిఫామ్‌ వేసుకో’... ‘స్కూల్‌ నుంచి వచ్చావు దుస్తులు మార్చుకో’... అంటూ చిన్నారులకు క్రమశిక్షణ నేర్పడం మంచిదే. అలాగే కప్‌బోర్డ్‌లో అవెక్కడున్నాయో కూడా తెలిసేలా సర్దితే మరీ మంచిది కదా. అదెలాగో చూద్దాం.

Updated : 18 Feb 2024 06:00 IST

‘టైం అవుతోంది యూనిఫామ్‌ వేసుకో’... ‘స్కూల్‌ నుంచి వచ్చావు దుస్తులు మార్చుకో’... అంటూ చిన్నారులకు క్రమశిక్షణ నేర్పడం మంచిదే. అలాగే కప్‌బోర్డ్‌లో అవెక్కడున్నాయో కూడా తెలిసేలా సర్దితే మరీ మంచిది కదా. అదెలాగో చూద్దాం.

దుస్తులకు..

 కప్‌బోర్డ్‌లో యూనిఫామ్‌, గౌన్లు, స్కర్టులు, ప్యాంట్లు, బనియన్లు, ఇన్నర్‌వేర్స్‌, సాక్సులు అంటూ రకరకాల దుస్తుల పేర్లు, వాటి బొమ్మలతో స్టిక్కర్లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఆయా దుస్తులను సర్దిన అలమర్లపై వీటిని అంటిస్తే చాలు. రంగురంగుల్లో ఆకర్షణీయంగా ఉండే వీటితో తమ దుస్తులు ఏవి ఎక్కడున్నాయో పిల్లలు తేలికగా గుర్తించగలరు. అలాగే వారికి సంబంధించిన దుస్తులను అలమరల్లో వారినే సర్దుకునే అలవాటూ... చేయొచ్చు.


పుస్తకాల కోసం..

లాంగ్వేజ్‌, సైన్స్‌, సోషల్‌, హిందీ అంటూ.. సబ్జెక్టుల పుస్తకాలన్నీ ఒకే చోట ఉంటాయి. వాటిలో కథల పుస్తకాలు,  డ్రాయింగ్‌ బుక్స్‌ కలిసిపోతే ఇబ్బందే. ఇలా కాకుండా ఉండాలని వచ్చినవే ఈ స్టిక్కర్లు. కథల పుస్తకాలకంటూ ఏర్పాటు చేసుకొనే అలమరకు వరసగా వీటిని అంటించొచ్చు. మనసుకు నచ్చిన పాత్రలున్న కథలు లేదా జంతువుల కథలు అంటూ వచ్చే ఈ స్టిక్కర్ల సాయంతో పుస్తకాలను విడదీసుకోవచ్చు. చదవాలనిపించిన కథను చిటికెలో అలమర నుంచి తీసుకొని చదువుకొంటారు. ఈ స్టిక్కర్ల ఉపయోగం భలేగుంది కదూ.. అంతే కాదు..చిన్నారులకూ, మనకూ సమయమూ కలిసి వస్తుంది. మరింకెందుకాలస్యం.. స్టిక్కర్ల సాయాన్ని అందించేయండి.


ఇష్టమొచ్చిన బొమ్మతో..

కార్లతో ఆడుతూ ఉన్న పిల్లాడు అకస్మాత్తుగా సూపర్‌హీరో బొమ్మలు కావాలని మారాం చేస్తాడు. అప్పటికప్పుడు అదెక్కడ పెట్టామో గుర్తు రాకపోవచ్చు. ఈ ఇబ్బంది లేకుండా చేస్తాయి ఈ స్టిక్కర్లు. బిల్డింగ్‌ సెట్‌, జంతువులు, కార్లు, సూపర్‌హీరోలు అంటూ రంగురంగుల బొమ్మలతో ఇవి లభ్యమవుతున్నాయి. ఆయా బొమ్మలుంచిన ట్రేలు లేదా అలమరలకు వీటిని అతికిస్తే చాలు. ఇష్టమొచ్చిన బొమ్మను వెతుక్కోకుండా పిల్లలు తీసి ఆడుకుంటారు. ఆట ముగిసిన తర్వాత తీసిన స్థానంలోనే వాటిని తిరిగి ఉంచడం నేర్పిస్తే చాలు. ఇల్లు చిందరవందర కావడం కూడా తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్