వంటకు ఏ నూనె మేలు..

ఆరోగ్యంగా ఉండాలని మార్కెట్‌లోకి వచ్చిన అన్ని రకాల నూనెలను వాడేస్తుంటారు. కాని ఏది మేలు చేస్తుంది అనేది తెలియదు. మరి ఏది మంచిదో తెలుసుకుందామా...

Updated : 18 Feb 2024 06:02 IST

ఆరోగ్యంగా ఉండాలని మార్కెట్‌లోకి వచ్చిన అన్ని రకాల నూనెలను వాడేస్తుంటారు. కాని ఏది మేలు చేస్తుంది అనేది తెలియదు. మరి ఏది మంచిదో తెలుసుకుందామా...

వేరు శెనగ... దీంట్లో విటమిన్‌ ఇ, మోనో శాచురేటెడ్‌, ఒమేగా 6 యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కంటిచూపునూ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

నువ్వుల నూనె.. ఇతర వాటితో పోలిస్తే ఇది ఆహారం సులువుగా జీర్ణం కావడానికి సాయపడుతుంది. ఇందులో ఫ్యాటీయాసిడ్లు ఎక్కువ. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లు, పంటి నొప్పులను తగ్గిస్తాయి.

సన్‌ ఫ్లవర్‌ నూనె... దీనిలో శాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్లు తక్కువ. మోనోశాచ్యురేటెడ్‌, పాలీ అన్‌ శాచురేటెడ్‌ కొవ్వులు చాలా ఎక్కువ. కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంట్లో ఉండే యాసిడ్లు రక్తంలో కొవ్వు తగ్గేందుకు తోడ్పడతాయి.

ఆవ నూనె.... ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఒమేగా3 ఫ్యాటీయాసిడ్లు ఉంటాయి. కాలేయం చుట్టూ కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. ఇది చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్