ఇంట్లో గాలిని శుద్ధి చేసే మొక్కలివే..

మనం వాడే రకరకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లూ,  క్లీనింగ్‌ వస్తువుల నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల ఇల్లు లేదా ఆఫీసులో గాలి కలుషితం అవుతుంటుంది.

Updated : 20 Feb 2024 04:39 IST

నం వాడే రకరకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లూ,  క్లీనింగ్‌ వస్తువుల నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల ఇల్లు లేదా ఆఫీసులో గాలి కలుషితం అవుతుంటుంది. దానివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. మరి గాలిని శుద్ధి చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచే మొక్కలు ఏంటో చూసేద్దాం.

కలబంద... ఇంట్లో సులభంగా పెరిగే మొక్క ఇది. దీనికి ఎక్కువ నీరు అవసరం ఉండదు. ఇది నిరంతరం ఆక్సిజన్‌ను విడుదల చేసి కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసుకుంటుంది.

స్నేక్‌ ప్లాంట్‌.. ఇంట్లో పెంచుకోదగ్గ మొక్కల్లో ఇది ఒకటి. ఇది కాలుష్య కారక వాయువులను పీల్చుకుని బయటకు ఆక్సిజన్‌ను సమృద్ధిగా విడుదల చేస్తుంది. ఇది పెరగడానికి తక్కువ సూర్యరశ్మి చాలు. ఎక్కడైనా పెరుగుతుంది.

బ్రమీలీయాడ్‌... ఇది ఇండోర్‌ మొక్క బెడ్‌రూమ్‌, హాల్లో ఎక్కడైనా అలంకరణకు అందంగా ఉంటుంది. గాలిని శుద్ధి చేయడంలో సాయపడుతుంది. ప్రశాంతమైన నిద్రను ప్రేరేపిస్తుంది.

పీస్‌ లిల్లీ... తెల్లని పూలు, ఆకులతో చూడ్డానికి అందంగా ఉంటుంది. ఇది సువాసనను అందించడమే కాదు గాలిని శుభ్రపరుస్తూ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్