వీటితో భలే తేలిక!

పని అందరం చేసేదే. అయితే దాన్ని తక్కువ సమయంలో, ఎక్కువ శ్రమలేకుండా చేసినప్పుడే కదా ‘స్మార్ట్‌’ అనిపించుకునేది. అందుకు ఉపయోగపడే కొన్ని కిచెన్‌ టూల్స్‌ ఇవే.

Published : 21 Feb 2024 01:40 IST

పని అందరం చేసేదే. అయితే దాన్ని తక్కువ సమయంలో, ఎక్కువ శ్రమలేకుండా చేసినప్పుడే కదా ‘స్మార్ట్‌’ అనిపించుకునేది. అందుకు ఉపయోగపడే కొన్ని కిచెన్‌ టూల్స్‌ ఇవే. ఓసారి లుక్కేయండి ...

చిందకుండా చిలికేద్దాం..!

వెన్న కోసం పెరుగును చిలుకుతాం కదా. ఒక్కోసారి అది మనపైన చింది బట్టలన్నీ పాడైపోతుంటాయి. పాత్ర చుట్టూ జిడ్డుగా అవుతుంది. అలాకాకూడదంటే ఈ పారదర్శక ‘బటర్‌ చర్నర్‌’ ఉపయోగించండి. ఓ గాజు జార్‌కి చర్నర్‌ జతచేసి ఉంటుంది. ఇందులో పెరుగు వేసి తిప్పితే చాలు. వెన్న తేలిగ్గా వచ్చేస్తుంది. తిప్పేటప్పుడు చేయి వత్తుకోకుండా చెక్క హ్యాండిల్‌ కూడా ఉంటుంది. స్టీల్‌ గేర్‌కు అమర్చి ఉన్న సిలికాన్‌ కవ్వం ఇందులో ఉంటుంది. ఇది పెరుగుని మెత్తగా చిలికి వెన్ననూ, మజ్జిగనూ వేరుచేస్తుంది. ఇందులో ఉండే సిలికాన్‌ పట్టీ పెరుగు చిందకుండా చేస్తుంది. ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా వెన్న, మజ్జిగ వేరవుతాయి. మీకూ నచ్చిందా! అయితే ఆన్‌లైన్లో వెతికేయండి.


నూనెను వడకట్టేస్తుంది...

కూరలు చేసుకున్నప్పుడు ఒక్కోసారి నూనె పైన తేలుతూ ఉంటుంది. దాన్ని అలానే తింటే మన పని అంతే...ఆరోగ్యానికి మంచిదని సూప్‌లు లాంటివీ చేస్తాం కదా! అయితే పిల్లలు మాత్రం కూరగాయల ముక్కలు వద్దే వద్దంటారు. కనీసం సూప్‌ అయినా తాగించాలి కదా మరి. ఇలాంటప్పుడే ఈ ‘ఆయిల్‌ సెపరేటర్‌ స్పూన్‌’ భలేగా ఉపయోగపడుతుంది. ఇది నూనెనూ, సూప్‌నూ వేరుచేస్తుంది. కూరగాయ ముక్కలూ రాకుండా అడ్డుకుంటుంది. ఈ స్టీల్‌ గరిటె వడపోత పరికరంలా పనిచేస్తుంది. ఇందులోని రంధ్రం గుండా సూప్‌ కప్పులోకి వస్తే, నూనె పైభాగంలో ఉండిపోతుంది. దాంతో ఇది ఆహారం వడ్డించుకోడానికి మాత్రమే కాదు... ఆయిల్‌ సెపరేటర్‌లానూ పనిచేస్తుంది. పైగా వద్దనుకున్న వాళ్లకి ముక్కల్నీ అడ్డుకుంటుంన్నమాట. అంటే ఒకే గరిటెతో రెండు ప్రయోజనాలన్నమాట!


పొట్టు తీయొచ్చు...

రొయ్యల కూర చేయటం తేలికేగానీ, వాటిని శుభ్రం చేయడమే అసలు పని. అయితే దాన్ని సులువు చేయడానికి వచ్చిన పరికరమే ‘ష్రింప్‌ పీలర్‌’. దీన్లో పదునుగా ఉండే భాగాన్ని రొయ్య శరీరంలోకి నెమ్మదిగా గుచ్చి, హ్యాండిల్‌ను ప్రెస్‌ చేస్తే చాలు. షెల్‌ తేలిగ్గా వచ్చేస్తుంది. ఇక రొయ్యను శుభ్రం చేసేటప్పుడు దాని నరాన్ని తొలగించడం తప్పనిసరి. చేతులతో తీయాలంటే మధ్యలోనే తెగిపోతుంటుంది. ఆ సమస్య లేకుండా ఈ ‘ష్రింప్‌ నైఫ్‌’ను వాడేయండి. దీనిలోని బొడిపెల్లాంటి నిర్మాణాలతో దాన్ని సులభంగా లాగొచ్చు. శుభ్రపరచటమూ తేలికవుతుంది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్