ఆలోచిస్తే అందమే!

బోర్‌కొట్టో, ఇక పనికి రావనో ఇంట్లో చాలా వాటిని పక్కన పడేస్తుంటాం. మీ సృజనకు కాస్త పదును పెట్టండి. తిరిగి ఎంత బాగా ఉపయోగపడతాయో అర్థమవుతుంది.

Updated : 24 Feb 2024 15:22 IST

బోర్‌కొట్టో, ఇక పనికి రావనో ఇంట్లో చాలా వాటిని పక్కన పడేస్తుంటాం. మీ సృజనకు కాస్త పదును పెట్టండి. తిరిగి ఎంత బాగా ఉపయోగపడతాయో అర్థమవుతుంది. అంతేనా... మీకూ సరదాగానూ ఉంటుంది. కావాలంటే ఇలా ప్రయత్నించి చూడండి...

  •  రంగు పోయిందని, బిగుతుగా అయిందని జీన్స్‌ వేసుకోకుండా బీరువాలోనే ఉంచేస్తున్నారా? అలాంటి వాటిని కత్తిరించి సెల్‌ఫోన్‌, పెన్నులు వంటివి వేసుకోవడానికి హ్యాండ్‌ పౌచ్‌లుగా, కూరగాయలు తెచ్చుకోవడానికి సంచులుగా తయారు చేసుకోండి. లేదంటే డోర్‌ మ్యాట్‌లుగానూ మార్చుకోవచ్చు.

  • వంటింట్లో బాణలి, పాత్రలకు రంధ్రాలు పడినా, టెఫ్లాన్‌ కోటింగ్‌ పోయినా పక్కన పడేస్తాం. వాటిని తిరిగి ఉపయోగించాలనుకుంటే... మట్టి నింపి కొత్తిమీర, మెంతికూర, పుదీనా వంటివి వేసి చూడండి. అవసరానికి ఎంచక్కా ఉపయోగపడతాయి. కాస్త రంగులద్దితే కుండీల్లా చూడటానికి బాగుంటాయి.
  •   దుస్తులు పాడైనా కొన్నిసార్లు చున్నీలు కొత్తవాటిలా మెరిసిపోతాయి. వాటిని దిండు, కుషను కవర్లు, కర్టెన్లుగా కుట్టి చూడండి. భలే ఆకట్టుకుంటాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్