మొక్కలు జాగ్రత్త...

ఎండలు మొదలయ్యాయి. అలా కాసేపు బయటికి వెళ్లొస్తే శరీరం తట్టుకోలేక పోతోంది కదూ. మనకే ఇలా ఉంటే పాపం... రోజంతా ఎండలో ఉండే పెరటి మొక్కల పరిస్థితేంటి? వాటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి!

Published : 24 Feb 2024 02:24 IST

ఎండలు మొదలయ్యాయి. అలా కాసేపు బయటికి వెళ్లొస్తే శరీరం తట్టుకోలేక పోతోంది కదూ. మనకే ఇలా ఉంటే పాపం... రోజంతా ఎండలో ఉండే పెరటి మొక్కల పరిస్థితేంటి? వాటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి!

  • మొక్కలకు ఈ కాలంలో సహజంగానే ఎక్కువ నీరు అవసరమవుతుంది. అలాగని పని అయిపోతుంది కదా అని ఒక్కసారే ఎక్కువ నీటిని పోసేయొద్దు. మొక్కలు చనిపోతాయి. మొక్క తీరును బట్టి నీటిని అందిస్తుండాలి. అలానే కుండీలు మార్చడం, మట్టిని వదులు చేయడం వంటివన్నీ ఇప్పుడు చేయకపోతేనే మేలు. అయితే ప్రూనింగ్‌ మాత్రం చేయొచ్చు. అంటే బాగా పెరిగిన, ఎండిన కొమ్మలను కత్తిరించడం అన్నమాట. ఇది మొక్క పెరుగుదలను ప్రోత్సహించడమే కాదు, ఎండ వేడిని తట్టుకునే శక్తినీ ఇస్తుంది.
  • ఈ కాలంలో మొక్కలకు నీళ్లెన్ని పోసినా త్వరగా ఆవిరైపోతాయి. లేదా  తొట్టెకు ఉండే రంధ్రాల ద్వారా బయటకు వచ్చేస్తాయి. అందుకే ఉదయాన్నే, సూర్యుడి ప్రభావం తగ్గాక రెండుసార్లు నీటిని అందిస్తే మేలు. కుదరదు అనిపిస్తే... కావాల్సినప్పుడల్లా నీటిని తీసుకునేలా మొక్కల కోసం కొన్ని పరికరాలు వస్తున్నాయి. వాటిని తెచ్చిపెట్టుకున్నా మంచిదే. లేదా చెక్క పొట్టును మొక్క మొదళ్లలో చల్లండి. అధిక వేడిమిని తట్టుకునేలా చేయడంలో ఇది చాలా బాగా సాయపడుతుంది.
  • మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే తగిన పోషణ తప్పనిసరి. వీలున్నంత వరకూ ఇంటి వృథాని కంపోస్ట్‌గా మార్చి అందిస్తే మంచిది. ఏవైనా సమస్యలు ఎదురైనా ఈ కాలం రసాయన ఎరువుల జోలికి పోకపోవడమే మేలు. బదులుగా సహజ ఎరువులను ఎంచుకోండి. మొక్కలూ ఆరోగ్యంగా ఎదుగుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్