మొక్కజొన్న పిండి ఉంటే చాలు..

వంటకాల్లో రుచిని పెంచడానికి మొక్కజొన్న పిండి వినియోగిస్తాం. అయితే ఇది రుచికే కాదు, ఇంటినీ, వస్తువులనూ మెరిసేలా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదెలాగంటే...

Updated : 25 Feb 2024 05:10 IST

వంటకాల్లో రుచిని పెంచడానికి మొక్కజొన్న పిండి వినియోగిస్తాం. అయితే ఇది రుచికే కాదు, ఇంటినీ, వస్తువులనూ మెరిసేలా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదెలాగంటే...

  • ఇది సహజసిద్ధమైన గ్లాస్‌ క్లీనర్‌గా పని చేస్తుంది. రెండు కప్పుల నీటికి టేబుల్‌స్పూన్‌ చొప్పున మొక్కజొన్నపిండి, వెనిగర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే సీసాలో నింపి గాజు కిటికీ, షెల్ఫ్‌ డోర్స్‌, టీపాయి, డైనింగ్‌ టేబుల్‌ వంటివాటిపై చల్లి మృదువైన వస్త్రంతో తుడిస్తే చాలు. మరకలు, దుమ్ము, గీతలు వంటివన్నీ మాయమై, తళతళలాడతాయి.
  • వాహనం నడిపేటప్పుడు దుస్తులకయ్యే గ్రీజ్‌ మరకలను ఈ పొడితో తేలికగా పోగొట్టొచ్చు. మరక ఉన్నచోట చెంచా మొక్కజొన్న పిండిని చల్లి 12 గంటలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పిండిని దులిపి వాషింగ్‌ మెషిన్‌లో వేస్తే ఆ వస్త్రం నుంచి గ్రీజ్‌ తేలికగా దూరమైపోతుంది.
  • వెండి నగలు, పాత్రల మెరుపు తగ్గినప్పుడు అరకప్పు పొడిని తీసుకుని సరిపడినంత నీటితో పేస్టులా చేయాలి. దీన్ని  వస్తువులకు పట్టించి మృదువైన వస్త్రంతో రుద్దితే పూర్వపు మెరుపు తిరిగి వస్తుంది.
  • బూట్లు ఎక్కువసేపు ధరించినప్పుడు చెమట పట్టి దుర్వాసన వస్తాయి. బూట్లలో కొంచెం మొక్కజొన్న పిండిని చల్లి రాత్రంతా వదిలేయాలి. తెల్లారిన తర్వాత షూ దులిపి, పొడి వస్త్రంతో తుడవాలి. దుర్వాసనను ఈ పిండి పీల్చుకోవడంతో సమస్య దూరమవుతుంది.
  • కార్పెట్‌పై పిల్లలు రకరకాల పదార్థాలను ఒంపుతుంటారు. దీంతో ఎంత శుభ్రపరిచినా ముక్కవాసన వదలదు. ముఖ్యంగా నూనె, పడితే ఆ జిడ్డు మరకలు త్వరగా పోవు. ఆ ప్రాంతంలో కాస్తంత మొక్కజొన్న పిండిని చల్లి అరగంటసేపు ఉంచి ఆ తర్వాత దులిపి శుభ్రపరిస్తే చాలు. మరకలూ, వాసనా దూరమవుతాయి.

వంటింట్లో..

ఒక వంతు నీటికి రెండొంతుల మొక్కజొన్న పొడి కలిపిన మిశ్రమాన్ని కిచెన్‌ సింక్‌ అంతా చల్లి రాత్రంతా వదిలేయాలి. తెల్లారాక కడిగితే సూక్ష్మజీవులు దూరంకావడమే కాకుండా సింకు శుభ్రపడి మిలమిలా మెరుస్తుంది. అలాగే వంటపాత్రలు మాడి మొండి మరకలు ఏర్పడినప్పుడు కూడా ఈ పేస్టుతో తేలికగా క్లీన్‌ చేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్