ప్రకృతితో మనం...!

ఇంటి అలంకరణలో భాగమైన ఫర్నిచర్‌ను ఎంపిక చేయడంలో మగువలు సహజత్వానికి పెద్దపీట వేస్తున్నారిప్పుడు. సృజనాత్మకంగా ఉండాలనీ కోరుకుంటున్నారు. అటువంటి అభిరుచి ఉన్నవారికి ఆకర్షణీయమైన రంగులతో ఉన్న ఈ సోఫా, డైనింగ్‌టేబుల్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌ వంటివి ఇట్టే నచ్చుతాయి. చెట్ల మొదళ్లు, కొమ్మలపై కూర్చున్న అనుభూతిని అందించేలా డిజైనర్లు వీటిని సృజనాత్మకంగా తయారుచేశారు.

Published : 26 Feb 2024 02:08 IST

ఇంటి అలంకరణలో భాగమైన ఫర్నిచర్‌ను ఎంపిక చేయడంలో మగువలు సహజత్వానికి పెద్దపీట వేస్తున్నారిప్పుడు. సృజనాత్మకంగా ఉండాలనీ కోరుకుంటున్నారు. అటువంటి అభిరుచి ఉన్నవారికి ఆకర్షణీయమైన రంగులతో ఉన్న ఈ సోఫా, డైనింగ్‌టేబుల్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌ వంటివి ఇట్టే నచ్చుతాయి. చెట్ల మొదళ్లు, కొమ్మలపై కూర్చున్న అనుభూతిని అందించేలా డిజైనర్లు వీటిని సృజనాత్మకంగా తయారుచేశారు. చెట్ల కొమ్మను టీపాయ్‌పై ఫ్లవర్‌వాజ్‌గా మార్చి మనసుకెంతో ఆహ్లాదాన్నిచ్చేలా డిజైన్‌ చేసిన తీరు మనసును కట్టిపడేస్తుంది. రాజసం ఉట్టిపడే లుక్‌తో సహజత్వానికి దగ్గరగా ఉన్న సోఫాలు, కుర్చీలు ఇంటీరియర్‌ డిజైనర్ల సృజనాత్మకతకు అద్దం పడుతున్నాయి. ప్రకృతి చెంత ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. మీ మనసునూ...  దోచేస్తున్నాయి కదూ!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్