తొక్కే కదా అని పారేయొద్దు!

రసాన్ని పిండేసి... నిమ్మ తొక్కల్ని పారేస్తాం. కానీ, వాటితోనూ బోలెడు ప్రయోజనాలున్నాయట. అవేంటంటారా?

Updated : 27 Feb 2024 05:33 IST

రసాన్ని పిండేసి... నిమ్మ తొక్కల్ని పారేస్తాం. కానీ, వాటితోనూ బోలెడు ప్రయోజనాలున్నాయట. అవేంటంటారా?

  • మురికిని వదిలించడానికి సబ్బు, కృత్రిమ రసాయనిక ఉత్పత్తుల కంటే నిమ్మకాయల్ని వాడటం మంచిది. వీటిల్లో ఆమ్ల గుణాలెక్కువ. బేకింగ్‌ సోడాలో కాస్త నిమ్మ తొక్కల పొడి కలిపి వంటగట్టు గోడల్ని రుద్దితే జిడ్డు త్వరగా వదులుతుంది.
  • ఇల్లు తుడిచే నీళ్లల్లో కాసిని నిమ్మతొక్కల్ని మరిగించిన నీళ్లను కలిపితే... ఈగలు ముసరకుండా ఉంటాయి. సూక్ష్మ క్రిములు నాశనమవుతాయి. కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కటింగ్‌ బోర్డులను శుభ్రం చేయడానికి వీటిని వాడొచ్చు. ఇవి సహజ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తాయి.
  • సెరామిక్‌ సింకులను శుభ్రం చేయడానికి నిమ్మతొక్కపై కాస్త సర్ఫ్‌ లిక్విడ్‌ వేసి రుద్దండి. రంగు మారిన అవి తిరిగి కొత్తవాటిలా మెరిసిపోతాయి.
  • ఈ మధ్యకాలంలో అవెన్‌ల వాడకం పెరిగింది. ఆహారపదార్థాల వ్యర్థాలు... గోడలకు అతుక్కుని ఓ పట్టాన వదలవు. ఇలాంటప్పుడు అందులో ఓ గిన్నె పెట్టి సగానికిపైగా నీళ్లు పోసి, నాలుగు నిమ్మతొక్కలు వేసి వేడి చేయండి. అవి మరిగి నీటి ఆవిరి లోపల అంతా వ్యాపిస్తుంది. సులువుగా శుభ్రపడుతుంది.
  • అలంకరణ కోసమనో, ఆరోగ్యానికనో ఈ మధ్య చాలా ఇళ్లల్లో రాగి, ఇత్తడి పాత్రల్ని వాడుతున్నారు. వీటిని శుభ్రం చేయడానికి నిమ్మ తొక్కలను మరిగించిన నీళ్లల్లో కాస్త బూడిద కలిపి రుద్దండి. త్వరగా శుభ్రపడతాయి. రంగూ మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్