సౌకర్యంగా తీసుకుందామా!

వంటగదిని ఎన్నిసార్లు సర్దినా ఎక్కడివి అక్కడే ఉన్నట్లు, గందరగోళంగా కనిపిస్తాయి. ఇలా ఉండటం వల్ల అవసరానికి వస్తువులు కనిపించకపోవడంతో పాటు ఒత్తిడీ పెరిగిపోతుంది.

Published : 29 Feb 2024 01:55 IST

వంటగదిని ఎన్నిసార్లు సర్దినా ఎక్కడివి అక్కడే ఉన్నట్లు, గందరగోళంగా కనిపిస్తాయి. ఇలా ఉండటం వల్ల అవసరానికి వస్తువులు కనిపించకపోవడంతో పాటు ఒత్తిడీ పెరిగిపోతుంది. మీది ఎంత చిన్నవంటగది అయినా సరే, ఈ చిట్కాలతో దాన్ని సౌకర్యంగా మార్చేసుకోవచ్చు. అదెలాగంటారా?

  • జీతం చేతిలో పడగానే... నెలకు సరిపడా సరకులన్నీ కొనితెస్తాం. తెచ్చాక ఏ పదార్థాన్ని ఏ డబ్బాలో పోశామో అవసరానికి కనిపించవు. దాంతో ఉన్న వాటిని అన్నీ తెరిచి చూసుకోవాలి. దీనివల్ల బోలెడు సమయం వృథా కావడంతో పాటు... ఓ పద్ధతిలో పెట్టినవన్నీ చెదిరిపోతాయి. ఈ పరిస్థితి రాకూడదంటే పారదర్శకంగా కనిపించే సీసాల్లోనే పప్పు, ఉప్పు, కారం...వంటివన్నీ నిల్వ చేసుకోండి. చూడగానే గుర్తుపట్టి తీసుకోవచ్చు. ఒక్కసారి వీటిమీద పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి సౌకర్యంగా వాడుకోవచ్చు. పైగా పర్యావరణహితం కూడా. అయితే, గాజువి కదా... వీటిని తీసి, పెట్టడంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పగిలిపోతాయి. మీకా భయం అక్కర్లేకుండా ఎంచక్కా వాటిని ఒకే రంగున్న స్టోరేజ్‌ ట్రేల్లో సర్దండి. సులువుగా తీసుకోవచ్చు. పెట్టేయొచ్చు.
  • ఒకేలాంటి పదార్థాలన్నీ అంటే... పప్పులన్నీ ఒకచోట, మసాలాలు మరోచోట పెడితే వంట చేసేటప్పుడు ఏమాత్రం తడుముకోకుండా ఠక్కున తీసుకోవచ్చు. ఆ స్టోరేజ్‌ కంటైనర్లన్నింటికీ లేబులింగ్‌ చేస్తే మరీ మంచిది. సీల్డ్‌ ప్యాక్‌లను ఉపయోగించడానికి ముందు మాత్రమే కత్తిరించుకుని డబ్బాల్లో పోసుకోవాలి. వీటికోసం ఓ ట్రాన్స్‌పరెంట్‌ స్టోరేజ్‌ బాక్స్‌ని కొని పెట్టుకోండి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్నవన్నీ అందులో పెట్టేయండి. దీన్ని ప్యాంట్రీలోనో, ఖాళీగా ఉన్న మరో స్థలంలోనో పెట్టుకుంటే వంటగది గజిబిజిగా ఉండదు.  
  • చిన్న చిన్నవి ట్రేల్లో వేస్తే...నిజంగా వాడుకోవాల్సి వచ్చినప్పుడు వెతకాల్సిందే. అలాకాకుండా కత్తెర, చాకులు, స్పూన్లు, కప్పులు... వంటివన్నీ పెగ్‌ బోర్డులకు తగిలించేయండి. మీ కళ్ల ఎదురుగానే కనిపిస్తాయి కాబట్టి సులువుగా తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్