ఇంటికి వెదురు తెచ్చే లుక్కు!

ఇంటి నిండా ఖరీదైన వస్తువులను అమర్చేస్తే ఆకర్షణీయంగా కనిపిస్తుందనుకునే రోజులు కావివి. ఈ సాధారణ వెదురు ఉత్పత్తులతోనూ ముచ్చటగా కనిపించేలా తీర్చిదిద్దుకోవచ్చు. అదెలాగో చూద్దామా!

Published : 01 Mar 2024 01:59 IST

ఇంటి నిండా ఖరీదైన వస్తువులను అమర్చేస్తే ఆకర్షణీయంగా కనిపిస్తుందనుకునే రోజులు కావివి. ఈ సాధారణ వెదురు ఉత్పత్తులతోనూ ముచ్చటగా కనిపించేలా తీర్చిదిద్దుకోవచ్చు. అదెలాగో చూద్దామా!

రానున్నదంతా వేసవి కాలమే. ఇంటిని చల్లబరచడానికి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడకం తగ్గించడమే కాదు... సహజ ఉత్పత్తులతో చేసిన వస్తువులను ఇంట్లో సర్దిపెట్టుకోండి. చల్లదనం పెరుగుతుంది. ఇందుకోసం వెదురుతో చేసిన బ్లైండ్స్‌ని కిటికీల దగ్గర వేలాడదీస్తే సరి. ఇవి వేడి గాలుల్ని ఇంట్లోకి రానివ్వవు. సాయంత్రాలు తడిపేస్తే చల్లదనమూ వస్తుంది.

  • వెదురు బుట్టలను తిరగేసి వాటి మధ్యలోంచి లైట్లను వేలాడదీయండి. వీటిని టెర్రస్‌, గార్డెన్‌, బాల్కనీ వంటి చోట్ల పెడితే... ప్రదేశానికి భలే లుక్కు వస్తుంది. సాయంత్రాలు చక్కగా కబుర్లు చెప్పుకోవడానికీ, డిన్నర్‌ చేయడానికీ అనువుగానూ ఉంటుంది.
  • బాల్కనీ, హాలు గోడలు ఖాళీగా కనిపిస్తే...వెదురుతో అల్లిన ఓ పెద్ద పళ్లెం తెచ్చి గోడకు వేలాడదీయండి. దానికి దగ్గరగా ఓ బల్లను వేసి దానిమీద యాంటిక్‌ మెటల్‌ పీసులు, చిన్న చిన్న మొక్కలు పెట్టేస్తే సరి. ఎంత బాగుంటుందో!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్