బుజ్జాయిలకోసం బుల్లి ఫర్నిచర్‌

బుడి బుడి అడుగులు వేసే బుడతలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. పిల్లలకు సౌకర్యాన్నీ, సంతోషాన్నీ ఇచ్చే వస్తువులను కొనాలనీ, వారికోసం చేసే ఏ పనైనా ప్రత్యేకంగా ఉండాలనీ కోరుకుంటాం.

Published : 03 Mar 2024 01:28 IST

బుడి బుడి అడుగులు వేసే బుడతలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. పిల్లలకు సౌకర్యాన్నీ, సంతోషాన్నీ ఇచ్చే వస్తువులను కొనాలనీ, వారికోసం చేసే ఏ పనైనా ప్రత్యేకంగా ఉండాలనీ కోరుకుంటాం. మీ అభిరుచిని గుర్తించే... చిన్నారులకోసం ప్రత్యేకంగా ఫర్నిచర్‌ రూపొందిస్తున్నారు తయారీదారులు. వీటిల్లో కుర్చీలు, సోఫాలు, రిక్లెనర్లూ, రీడింగ్‌ టేబుల్స్‌... ఒకటేమిటి పెద్దలు వాడే ప్రతి వస్తువుకీ ఓ మినీయేచర్‌ రూపాన్ని తెచ్చేశారు. మీ ఇంటి ఇంటీరియర్‌కి తగ్గట్లు మీరు ఫర్నిచర్‌ ఎంచుకున్నప్పుడే...మీ అబ్బాయికీ, అమ్మాయికీ కూడా కస్టమైజ్డ్‌ సోఫానో, కుర్చీనో ఆర్డరు ఇచ్చేయండి. పసివాళ్లను ఆకట్టుకునే రంగుల్లోనూ దొరుకుతున్నాయి. ఎంచక్కా వీటికి వెనకభాగంలో బొమ్మలు దాచుకోవడానికీ, పుస్తకాలు పెట్టుకోవడానికీ అమరికా ఉంటోంది. వీరి ఎత్తు, వయసుకు తగ్గట్లు ఉండటంతో... అనువుగానూ ఉపయోగించుకుంటున్నారు. మరింకెందుకాలస్యం... రానున్న పుట్టినరోజుకి ఈ కానుకను ఇచ్చి చూడండి. మురిసిపోతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్