పెళ్లయినా... మానుకోలేకపోతున్నా!

గోళ్లు కొరుక్కోవడం అనేది చిన్నప్పటి నుంచీ ఉందంటే... మీకు అభద్రతాభావం గానీ, ఆందోళనగానీ ఉండి ఉండొచ్చు. ఎవరితోనైనా మాట్లాడాలంటే భయమూ, సంకోచమూ ఉన్న వ్యక్తిత్త్వం ఉన్నవాళ్లు... వెంట్రుకలను మడతపెట్టడం, గోళ్లు కొరుక్కోవడం, కాళ్లు ఊపడం, చేతులు, బట్టలు మెలిపెట్టడం... వంటివి చేస్తుంటారు. వీటిని ‘న్యూరాటిక్‌ ట్రెయిట్స్‌’ అంటారు.

Published : 11 Mar 2024 14:30 IST

నా వయసు 27. చిన్నప్పటి నుంచీ గోళ్లు కొరికే అలవాటు ఉంది. ఇప్పటికీ మానుకోలేకపోతున్నా. ఈ మధ్యే పెళ్లి కూడా అయింది. ఎవరేమనుకుంటారో అని భయం. అసలు ఈ అలవాటు మానేదెలా?

ఓ సోదరి

గోళ్లు కొరుక్కోవడం అనేది చిన్నప్పటి నుంచీ ఉందంటే... మీకు అభద్రతాభావం గానీ, ఆందోళనగానీ ఉండి ఉండొచ్చు. ఎవరితోనైనా మాట్లాడాలంటే భయమూ, సంకోచమూ ఉన్న వ్యక్తిత్త్వం ఉన్నవాళ్లు... వెంట్రుకలను మడతపెట్టడం, గోళ్లు కొరుక్కోవడం, కాళ్లు ఊపడం, చేతులు, బట్టలు మెలిపెట్టడం... వంటివి చేస్తుంటారు. వీటిని ‘న్యూరాటిక్‌ ట్రెయిట్స్‌’ అంటారు. ఆందోళనతో కూడుకున్న వ్యక్తిత్త్వం ఉన్నవాళ్ల లక్షణాలివి. మీలో ఆత్మన్యూనతాభావం ఉన్నా, చిన్నప్పుడు ఒత్తిడికి గురైనా ఇటువంటి లక్షణాలు అలవాటుగా మారిపోయి ఉంటాయి. ఏదైనా ఆందోళన కలిగినప్పుడు మీకు తెలియకుండానే అది ఈ చేతల ద్వారా వ్యక్తమవుతుంది. ఆందోళన తగ్గించుకుంటే ఇవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజ్‌, మెడిటేషన్‌ వంటివి ప్రారంభించండి. నెమ్మదిగా కొత్తవాళ్లతోనూ మాట్లాడడానికి ప్రయత్నించండి. అలాచేస్తే మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. క్రమేణా సమస్యా తగ్గుముఖం పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్