పండ్లు శుభ్రం చేస్తున్నారా...

వేసవి వచ్చిందంటే చాలు... పుచ్చకాయ నుంచి మామిడి వరకూ ఎన్నో పండ్లను తింటుంటాం. త్వరగా పక్వానికి రావాలని కొన్ని రకాల మందులు వాటిపై చల్లుతుంటారు.

Published : 30 Mar 2024 01:41 IST

వేసవి వచ్చిందంటే చాలు... పుచ్చకాయ నుంచి మామిడి వరకూ ఎన్నో పండ్లను తింటుంటాం. త్వరగా పక్వానికి రావాలని కొన్ని రకాల మందులు వాటిపై చల్లుతుంటారు. ఒకసారి నీటితో శుభ్రం చేస్తే చాలు తినేయొచ్చు అనుకుంటాం. కానీ వాటిపై ఉండే రసాయనాలు అంత తొందరగా పోవు. కాబట్టి వీటిని సరైన పద్ధతిలో శుభ్రం చేసి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అదెలానో చూసేద్దాం..

  • ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో స్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి పండ్లను 15 నిమిషాలు నానబెట్టాలి. తరవాత వాటిని మంచి నీటితో శుభ్రం చేసుకుంటే క్రిములన్నీ తొలగిపోతాయి.
  • మూడు వంతుల నీటికి ఒక వంతు వైట్‌ వినెగర్‌ కలపాలి. పండ్లను ఆ మిశ్రమంలో పది నిమిషాలు ఉంచి ఆపై చేత్తో రుద్ది కడిగితే రసాయనాలు తొలగిపోతాయి.
  • స్పూన్‌ ఉప్పు, చిటికెడు పసుపు కలిపిన నీటిలో పండ్లు వేసి అరగంట పాటు నానబెట్టాలి. ఆపై నీటితో చక్కగా శుభ్రం చేస్తే చాలు. వాటిపై ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది.
  • ఇవన్నీ చేయలేమనుకుంటే కనీసం మార్కెట్‌ నుంచి తెచ్చిన పండ్లను వెంటనే నీటిలో ఒక పదినిమిషాల పాటు ఉంచాలి. తరవాత మళ్లీ వేరే నీటితో శుభ్రం చేసుకుని తిన్నా మంచిదే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్