కలల ప్రపంచాన్ని ముందు ఉంచుతాయివి..!

పిల్లలు రాత్రిపూట ఊహా ప్రపంచంలోకి అడుగుపెడతారు. మనసుకు నచ్చినవాటిని గుర్తుకు తెచ్చుకొని నిద్రలోకి జారుకుంటారు. అలా వారి మనసెరిగిన చిత్రం గది మధ్యలో సహజంగా కనిపిస్తే..? ఆ సంతోషానికి హద్దు ఉండదేమో కదూ.

Published : 31 Mar 2024 01:33 IST

పిల్లలు రాత్రిపూట ఊహా ప్రపంచంలోకి అడుగుపెడతారు. మనసుకు నచ్చినవాటిని గుర్తుకు తెచ్చుకొని నిద్రలోకి జారుకుంటారు. అలా వారి మనసెరిగిన చిత్రం గది మధ్యలో సహజంగా కనిపిస్తే..? ఆ సంతోషానికి హద్దు ఉండదేమో కదూ.

చిన్నారులు సహజంగా సూపర్‌మేన్‌, కార్టూన్‌ క్యారెక్టర్లు, టెడ్డీబేర్‌ని ఇష్టపడతారు. వారిలో తమని తాము ఊహించుకుని కలల ప్రపంచంలో పయనిస్తారు. అందుకే ఇంటీరియర్‌ డిజైనర్లు కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ రకమైన సీలింగ్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. గది మధ్యలో సూపర్‌మేన్‌ వేలాడుతూ.. కనిపిస్తుంటాడు. హాట్‌ బెలూన్‌లో టెడ్డీబేర్‌ ఎగురుతూ ఉంటుంది. లైట్‌ అటాచ్‌మెంట్‌తో ఇవి మరింత కాంతిమంతంగా కనిపిస్తుంటే చిన్నారుల కనుల నిండా కలలే నిండిపోతాయి.


పదును పెట్టేలా...

బుజ్జాయిల మనసు దోచే నీలాకాశంలోని నక్షత్రాలు, మబ్బులు, ఇంద్రధనుస్సు వంటివి వారి పడకకు పైనే ఉంటే..? తళుక్కుమంటూ వారి కళ్లెదుటే మెరుస్తుంటే మనసంతా ఉత్సాహంతో నిండిపోదూ..! అలాగే వారి గది సీలింగ్‌లో ఇమిడిపోయే బెలూన్లతో నింగిలోకి ఎగిరే భవనం, విమానం, హెలీకాప్టర్‌ వంటివి వారి చిట్టి మెదడును మరింత పదును పెడతాయేమో కదూ..!


అంతరిక్షం...

పెద్దైన తర్వాత అంతరిక్షంలో ఎగురుతా. వ్యోమగామినవుతాను అనే పిల్లలకు ఆ ఊహలనే కళ్లెదుట ఉంచుతాయి ఈ స్పేస్‌ సీలింగ్‌లు. స్పేస్‌సూట్‌తో వ్యోమగామి ఎగురుతున్నట్లు కనిపిస్తుంటే భవిష్యత్తును ఊహించుకుంటూ నిద్రలోకి జారుకుంటారేమో కదూ.. అలాగే సౌరమండలంపై అవగాహన పెరిగేలా ఈ సోలార్‌సిస్టమ్‌ సీలింగ్‌ వారికి విజ్ఞానాన్ని పంచుతుంది. విశ్వరహస్యాలను విప్పి చెబుతుంది. అది వారిని మరింత ఆలోచించేలా చేస్తుంది. ఇవన్నీ భలేగున్నాయి కదూ... మరింకెందుకాలస్యం. మీ బుజ్జాయిలకూ ఏర్పాటు చేసిచ్చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్