రెండువైపులా చల్లటిగాలి...

ఎండలు మండుతున్నాయ్‌. అదనంగా ఉక్కపోత. ఒకరిద్దరం అంటే ఫ్యాన్‌ వేసుకుని కూర్చుంటాం. కానీ ఎక్కువమంది ఉంటే ఒక్క ఫ్యాన్‌తో కష్టమేకదా... కార్లో ప్రయాణిస్తుంటాం. అందరికీ ఏసీ పడదుగా!  మరప్పుడు మిగతావారి పరిస్థితి ఏంటి? ఈ ఇబ్బందులకు పరిష్కారంగా వచ్చినవే  ‘డబుల్‌ హెడెడ్‌ ఫ్యాన్లు’.

Updated : 01 Apr 2024 08:19 IST

స్వీట్‌ హోమ్‌

ఎండలు మండుతున్నాయ్‌. అదనంగా ఉక్కపోత. ఒకరిద్దరం అంటే ఫ్యాన్‌ వేసుకుని కూర్చుంటాం. కానీ ఎక్కువమంది ఉంటే ఒక్క ఫ్యాన్‌తో కష్టమేకదా... కార్లో ప్రయాణిస్తుంటాం. అందరికీ ఏసీ పడదుగా!  మరప్పుడు మిగతావారి పరిస్థితి ఏంటి? ఈ ఇబ్బందులకు పరిష్కారంగా వచ్చినవే  ‘డబుల్‌ హెడెడ్‌ ఫ్యాన్లు’. అంటే ఒకే స్టాండ్‌కి రెండు తలలు ఉంటాయన్నమాట. అందులో పెడెస్ట్రల్‌, పోర్టబుల్‌, సీలింగ్‌ రకాల్లో వచ్చేశాయివి. పెడెస్ట్రల్‌ ఫ్యాన్‌ను హాలు, కిచెన్‌, లివింగ్‌రూమ్‌, ఆఫీస్‌... ఇలా ఎక్కడైనా తేలిగ్గా పెట్టేసుకోవచ్చు. అన్ని కోణాల్లో సమానంగా గాలిని ఇస్తాయివి. ఒక మోటార్‌కే రెండు ఫ్యాన్‌ తలలు అమర్చి ఉంటాయి. వాటిని మనకు కావాల్సిన ఎత్తు, స్పీడ్‌, ఏ కోణాల్లో తిరగాలనేది ఫ్యాన్‌కు ఉండే రోటరీ స్విచ్‌ను బట్టి సెట్‌ చేసుకోవచ్చు. మరో రకంవి పోర్టబుల్‌ ఫ్యాన్‌లు. కార్‌లో తేలిగ్గా డ్యాష్‌బోర్డుకి అమర్చుకోవచ్చు. కారులో దుర్వాసన, దుమ్మూధూళీ రాకుండా గాలి ధారాళంగా ప్రసరించేలా చేస్తూ, తాజా గాలిని అందిస్తాయి. డబుల్‌ హెడ్‌తో డబుల్‌ ప్రయోజనాలందించే ఇంకో రకం ఫ్యాన్లు సీలింగ్‌ ఫ్యాన్లు... రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పనిచేసే ఇవి కాలానికి తగినట్లు పనిచేస్తాయి. వేసవిలో చల్లగాలి, చలికాలంలో వేడిగాలి వచ్చేలా చేసి, ఎయిర్‌ కండిషనర్‌లా పనిచేస్తాయి. ఛార్జింగ్‌, ఎలక్ట్రిక్‌ వంటి రకాల్లో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయివి. కావాలంటే ఆన్‌లైన్లో వెతికేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్