అవన్నీ అబద్ధాలే..!

మాకు పెళ్లయ్యి మూడేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. పిల్లలు అప్పుడే వద్దనుకున్నాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. అయితే పెళ్లికి ముందు ఆయన తనకు ఎటువంటి దురలవాట్లు లేవని చెప్పారు. కానీ, ఈ మూడేళ్ల ప్రయాణంలో ఆయనకు లేని చెడు అలవాట్లే లేవని అర్థమైంది.

Updated : 01 Apr 2024 15:04 IST

మాకు పెళ్లయ్యి మూడేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. పిల్లలు అప్పుడే వద్దనుకున్నాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. అయితే పెళ్లికి ముందు ఆయన తనకు ఎటువంటి దురలవాట్లు లేవని చెప్పారు. కానీ, ఈ మూడేళ్ల ప్రయాణంలో ఆయనకు లేని చెడు అలవాట్లే లేవని అర్థమైంది. అమ్మావాళ్లతో చెబితే నువ్వే తనని మార్చుకోవాలి అంటున్నారు. నాతో అన్ని అబద్ధాలు చెప్పిన ఆయనతో జీవితకాలం ప్రయాణించాలంటే ఏదో తెలియని అభద్రతాభావం. ఏం చేయాలో తోచట్లేదు. సలహా ఇవ్వగలరు.

ఓ సోదరి

పెళ్లి చేసుకునే ముందు ఇష్టాయిష్టాలు, అలవాట్లు ఒకరివి ఒకరు తెలుసుకోవడం సహజం. అయితే అందరూ నిజమే చెబుతారని అనుకోలేం. అది వాళ్ల వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరు లోపల ఒకటి ఉంచుకుని బయటకు మరొకటి చెబుతుంటారు. ఇంకొందరు పెళ్లి అవడం కోసం వాళ్లకు ఉన్న చెడు అలవాట్లను కప్పిపుచ్చుతుంటారు. ఇలాంటి విషయాలను దాచిపెట్టి అతను మీ నమ్మకాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మీరు అతనికి ఎదురు తిరిగి, తనను తప్పుపట్టడం వల్ల లాభం ఏమీ లేదు. ఒకవేళ మీరు క్షమించి, తనతో కలిసి జీవించాలని అనుకుంటే అతను మారే పరిస్థితి ఉందేమో చూడండి. అవసరమైతే కౌన్సెలింగ్‌ ఇప్పించి, మారడంలో తనకు సాయపడండి. అప్పటికీ అతను తన ధోరణి మార్చుకోకుండా, మొండిగా వ్యవహరిస్తే మీరు మీవైపు నుంచి నిర్ణయం తీసుకోండి. మీ జీవితాన్ని పాడుచేసుకోవద్దు. స్వతంత్రంగా బతకడానికి సంకోచించకండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవారితో పిల్లలు పుట్టిన తర్వాత మరింత కష్టం అవుతుంది. అందుకే ఆలోచించి ముందడుగు వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్