పెళ్లి నాటికి... బరువు తగ్గేదెలా!

నాకు 25 ఏళ్లు. ఎత్తు 5.5. బరువు 95 కేజీలు. నేను మాంసాహారిని. నెలరోజుల్లో నా పెళ్లి. ఈ తక్కువ సమయంలో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నా.

Updated : 04 Apr 2024 14:42 IST

నాకు 25 ఏళ్లు. ఎత్తు 5.5. బరువు 95 కేజీలు. నేను మాంసాహారిని. నెలరోజుల్లో నా పెళ్లి. ఈ తక్కువ సమయంలో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నా. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? - సంధ్య, హైదరాబాద్‌

జ. స్థూలకాయానికి కారణాలనేకం. ఒకవేళ కుటుంబంలో ఒబెసిటీ ఉన్నా, లేదా జీవనశైలి సరిగా లేకున్నా కూడా ఇది రావచ్చు. ఆరోగ్య సమస్యలూ ఇందుకు దారితీ యొచ్చు. మీ ఎత్తుకి, 67 కేజీలు కన్నా తక్కువ బరువు ఉండాలి. నెలలో పెళ్లి ఉందంటున్నారు. ఉన్నపళంగా అంత బరువు ఒకేసారి తగ్గడం మీకు మంచిది కాదు. కానీ బరువు తగ్గాలంటే.. ముందు పదిశాతం తగ్గేలా చూసుకోవాలి. దీనికి 2 నుంచి 3 నెలలు సమయం పెట్టుకుంటే సరి. అంటే 72 కేజీలకు తగ్గాలి.

⚛ ముందుగా తీపి, ఉప్పు, కొవ్వులు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

⚛ రోజు మొత్తానికి 20ఎం.ఎల్‌ నూనె మాత్రమే తీసుకోవాలి.

⚛ షుగర్‌ రెండు స్పూన్లకి మించకూడదు.

⚛ మైదా పదార్థాలకి దూరంగా ఉండాలి.

⚛ వేపుళ్లు, పచ్చళ్లు, బయట ఆహారాలు తగ్గించాలి.

ఇవి పాటిస్తూ రోజుకి 200గ్రా.లు ఉడికించిన కాయగూరలూ, 100 గ్రా.లు ఆకుకూరలను తీసుకోవాలి. రోజుకొక సీజనల్‌ పండు తినాలి. రాత్రి భోజనంలో రాగులు, కొర్రలు, గోధుమలు, సజ్జలు, జొన్నలు పిండితో చేసిన చపాతీలు మాత్రమే తీసుకోవాలి. 8 నుంచి 12 నట్స్‌ను చిరుతిండిగా తీసుకోవాలి. వీటితో పాటు... మూడు నుంచి నాలుగున్నర లీటర్ల నీటిని తాగాలి. నిద్ర, ఆహార వేళలు క్రమం తప్పక పాటించాలి. వారంలో ఆరు రోజులు గంట చొప్పున వ్యాయామం చేయాలి. ఇవన్నీ పాటించడంతో పాటు... థైరాయిడ్‌, బ్లడ్‌షుగర్‌, కొవ్వు, హార్మోన్ల హెచ్చుతగ్గులకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. వాటి ఫలితాలను బట్టి పోషకాహార నిపుణులను సంప్రదించి వారి సూచనలు తీసుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్