ఆరోగ్యాన్నిచ్చే ఇంటి మొక్కలు...

మొక్కల పెంపకం ఇప్పుడందరికీ వ్యాపకంగా మారింది. ఆ ఆసక్తే... వీటికి ఇంటి అలంకరణలోనూ చోటిచ్చేలా చేసింది. వీటితో ఆరోగ్య ప్రయోజనాలూ బోలెడు. అవేంటో చూసేద్దామా.

Published : 05 Apr 2024 01:54 IST

మొక్కల పెంపకం ఇప్పుడందరికీ వ్యాపకంగా మారింది. ఆ ఆసక్తే... వీటికి ఇంటి అలంకరణలోనూ చోటిచ్చేలా చేసింది. వీటితో ఆరోగ్య ప్రయోజనాలూ బోలెడు. అవేంటో చూసేద్దామా...

  • నిత్యం మనం ఇంట్లో వాడే క్లీనర్లూ, ఇతరత్రా ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి గాల్లోకి అనేక రసాయనాలు, విష వాయువులూ విడుదలవుతాయి. ఇలా కలుషితమైన గాలిని  శుద్ధి చేసి స్వచ్చంగా పీల్చుకోవాలంటే ఇంట్లో స్నేక్‌ ప్లాంట్‌, పీస్‌లిల్లీ, స్పైడర్‌, అరేకాపామ్‌ వంటి ఇండోర్‌ మొక్కల్ని పెంచమంటోంది నాసా సంస్థ.
  • వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అలర్జీలు దూరం కావాలంటే మీ పడకగదిలో సాన్సేవిరియా మొక్కల్ని పెంచుకుని చూడండి. ఇవి గాలిని శుభ్రపరిచి రోగాలను రానివ్వవట.
  • కలబంద, లెమన్‌గ్రాస్‌, లావెండర్‌ మొదలైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలను గదిలో పెంచుకోవడం వల్ల గాయాలు, దురద వంటివాటికి తక్షణ నివారిణిగా పనిచేస్తూ, ఇంటిల్లిపాదినీ ఆరోగ్యంగా ఉంచుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్