వేసవిలో ఇవి తగ్గించాలి...

మొక్కల పెరుగుదల, అభివృద్థికి  అవసరమైన పోషకాలను అందించడంలో ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ అన్ని రకాల ఎరువులు వేసవిలో సరిపడవు.

Published : 06 Apr 2024 01:58 IST

మొక్కల పెరుగుదల, అభివృద్థికి  అవసరమైన పోషకాలను అందించడంలో ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ అన్ని రకాల ఎరువులు వేసవిలో సరిపడవు. అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు ఒత్తిడికి గురవుతాయి.. దీనికితోడు ఎరువులను కూడా వేస్తే ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. ఏమేం వాడకూడదంటే...

  • ఇంటి తోటను పెంచేవారు సాధారణంగా మొక్కల ఆకులు గుబురుగా, పచ్చగా పెరగడానికి నత్రజని వాడుతుంటారు. కానీ అప్పటికే వేడివల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. నైట్రోజన్‌ వేశాక మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
  • కొన్నిసార్లు మొక్కలకు అమోనియా ఆధారిత ఎరువులను వాడుతుంటాం. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వీటితో ఆకు రంగు మారడం, పెరుగుదల నిలిచిపోవడం వంటివి జరిగి వేరుమూలం దెబ్బతినే అవకాశం ఉంది.
  • మొక్కలు వేర్ల నుంచి బాగా వృద్ధి చెంది, పుష్పించేలా చేయడంలో భాస్వరం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే అధిక ఫాస్ఫరస్‌ మొక్కల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశమూ ఉంది. అంతేకాదు, ఈ సమయంలో మొక్కలకు పోషకాల కంటే తగినన్ని నీటిని అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ భాస్వరం కుండీ లేదా, తోటమట్టిలో పేరుకుని ఉంటుంది. ఇది మొక్క వేరు తెగులుకు దారితీస్తుంది. వీటికి ప్రత్యామ్నాయంగా వేసవిలో మొక్కలకు పోషకాల అసమతుల్యతను తగ్గించడానికి సేంద్రియ ఎరువులను ఎంచుకోవాలి. ఇవి మొక్కలకి ఒత్తిడి పెంచకుండా పోషకాలను అందిస్తాయి.
  • కంపోస్ట్‌ టీని సేంద్రియ ఎరువు నుంచి తయారు చేస్తారు. ఈ ద్రవరూప ఎరువులు నేల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, వ్యాధికారక క్రిముల నుంచి మొక్కలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. ఈ కంపోస్ట్‌ టీ నేలా, ఆకులపై కూడా చల్లొచ్చు. ఒత్తిడిని పెంచే ఎరువులను నివారించి, మొక్కలను శ్రద్ధగా పెంచితే ఇంటితోటలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్