మొక్కలకు మజ్జిగ మందు...

మొక్కల తెగుళ్ళను నియంత్రించడంలో మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లాక్టోబాసిల్లస్‌ అనే బ్యాక్టీరియా మట్టిలో హానికారక సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రించి, తెగుళ్ల నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, పోషకాలు మొక్కల్ని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

Updated : 07 Apr 2024 01:48 IST

మొక్కల తెగుళ్ళను నియంత్రించడంలో మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లాక్టోబాసిల్లస్‌ అనే బ్యాక్టీరియా మట్టిలో హానికారక సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రించి, తెగుళ్ల నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, పోషకాలు మొక్కల్ని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

లీటరు నీటిలో, పావులీటరు మజ్జిగ, టేబుల్‌ స్పూన్‌ డిష్‌వాష్‌ లిక్విడ్‌, టేబుల్‌ స్పూన్‌ వంటనూనె వేసి కలపాలి. రాత్రంతా నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసి మొక్కలపై పిచికారీ చేయాలి. మజ్జిగ మందును ఆకులు, కాండంతో పాటూ తెగుళ్లు సోకిన ఇతర భాగాలపైనా స్ప్రే చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే మిల్లీబగ్స్‌, గొంగళి పురుగులు వంటి క్రిమికీటకాలు దరిచేరవు. ఇలా చేసేటప్పుడు వాతావరణం పొడిగా ఉండేలా చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్