మబ్బుల్ని ఇంట్లోకి తెచ్చేసుకుందాం..!

ఇల్లంటే నాలుగు గోడలనే రోజులు ఎప్పుడో పోయాయి. ఇంట్లోని ప్రతి వస్తువూ మన అభిరుచిని వ్యక్తపరిచేలా ఉండాలని కోరుకుంటున్నారిప్పుడు. ప్రశాంతత కోసం, ప్రకృతి అందాల్ని ఇంట్లోనే దాన్ని సృష్టించుకుంటున్నారు.

Published : 08 Apr 2024 02:20 IST

ఇల్లంటే నాలుగు గోడలనే రోజులు ఎప్పుడో పోయాయి. ఇంట్లోని ప్రతి వస్తువూ మన అభిరుచిని వ్యక్తపరిచేలా ఉండాలని కోరుకుంటున్నారిప్పుడు. ప్రశాంతత కోసం, ప్రకృతి అందాల్ని ఇంట్లోనే దాన్ని సృష్టించుకుంటున్నారు. అందుకు నింగిలోని మబ్బులనైనా సరే నేలమీదకి దించుతున్నారు. ఇంట్లో అందంగా వేలాడదీస్తున్నారు. అలాంటివే ఈ క్లౌడ్‌ ల్యాంపులు. హై డెన్సిటీ పాలీ ఇథిలీన్‌ ఫైబర్‌ (హెచ్‌డీపీఈ)తో తయారుచేసిన ఈ ల్యాంపులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అవి అచ్చం మబ్బులను పోలి ఉండడమే అందుకు కారణం. దాంతోపాటు ఇవి రీసైక్లింగ్‌కూ అనువుగా ఉంటాయి. ఎలా మడిచినా చినగకపోవడం, వాటర్‌ ప్రూఫ్‌... వంటివి వీటి ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి. పైగా వీటిని కేవలం ఇండోర్‌లోనే కాదు, సెమీ అవుట్‌ డోర్‌ ల్యాంపులుగానూ ఉపయోగించుకోవచ్చు. వీటిని గార్డెన్‌లో అమర్చుకుంటే, సరదాగా కుటుంబం, స్నేహితులతో అలా ఆరుబయట కాసేపు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు... మబ్బులోంచి వస్తోన్న ఆ కాంతిని చూస్తే ఆనందంగా అనిపిస్తుంది. బెడ్‌ పక్కన అందమైన అలంకరణగానూ పెట్టేసుకోవచ్చు. హాలు, డైనింగ్‌ రూమ్‌... ఇలా ఎక్కడైనా తేలిగ్గా ఓ హుక్‌కి తగిలించుకోవచ్చు. వీటి వెలుగులో కూర్చొని, నచ్చిన సంగీతాన్ని వింటూ, కమ్మని కాఫీనో, టీనో తాగుతూ ఉన్నామంటే మబ్బుల్లో రెక్కలు కట్టుకుని విహరిస్తున్నామేమో అన్న భావన తప్పక కలుగుతుంది. మీకూ నచ్చాయా ఇవి... అయితే ఆన్‌లైన్లో చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్