ఇంట్లో ఈగల బెడదా?

వేసవికాలం వచ్చేసింది. ఇంట్లో ఈగల బెడద మొదలవుతుంది. డైనింగ్‌ టేబుల్‌, వంటగట్టు మీద, గచ్చుపైనా, పెంపుడు జంతువుల చుట్టూ వాలి ఇబ్బంది పెడుతుంటాయి. దీనినుంచి బయట పడాలంటే ఈ కింది చిట్కాలను పాటించేయండి మరి.

Published : 08 Apr 2024 02:23 IST

వేసవికాలం వచ్చేసింది. ఇంట్లో ఈగల బెడద మొదలవుతుంది. డైనింగ్‌ టేబుల్‌, వంటగట్టు మీద, గచ్చుపైనా, పెంపుడు జంతువుల చుట్టూ వాలి ఇబ్బంది పెడుతుంటాయి. దీనినుంచి బయట పడాలంటే ఈ కింది చిట్కాలను పాటించేయండి మరి.

రెండు నిమ్మ చెక్కలను లీటరు వేడినీటిలో వేసి మరిగించాలి. ఆపై దానికి కొన్ని చుక్కల రోజ్‌మెరీ నూనెను కలిపి ఒక స్ప్రేబాటిల్లో పోసుకోవాలి. ఈగలు ఉన్నచోట చల్లితే సరి సమస్య పోవడమే కాదు పరిమళాలూ వెదజల్లుతాయి.

  • కప్పు నీటికి, రెండుకప్పుల వెనిగర్‌, అరకప్పు నిమ్మరసం కలిపి ఇంట్లోనే ఈగల మందునూ తయారు చేసుకోవచ్చు.
  • వచ్చేవి వేసవి సెలవులు. చిన్నపిల్లలు ఉంటే ఆహారపదార్థాలు కింద పడకుండా తినరు. సోఫా, కార్పెట్లు ఇలా ఎక్కడబడితే అక్కడ పడేస్తారు. వీటిని శుభ్రం చేయడమూ కష్టమే. ఇలాంటప్పుడు వంటసోడాను వీటిపై చల్లి మందపాటి బ్రష్‌తో రుద్ది, కొద్దిసేపయ్యాక దులిపేయాలి. దీంతో కంటికి కనిపించని ఈగల గుడ్లు కూడా తొలగిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్