ఉగాదికి... అమ్మకు ఒడిబియ్యం!

ఆడపిల్ల పెళ్లై అత్తారింటికి వెళ్లినా పుట్టింటి వాళ్లు ఐదేళ్లకోసారి పిలిచి ఆప్యాయంగా ఒడిబియ్యం పోస్తారు. తెలంగాణ సహా కొన్ని తెలుగు ప్రాంతాల్లో ఈ ఒడిబియ్యం ఆచారం తెలిసిందే.

Published : 09 Apr 2024 01:36 IST

ఆడపిల్ల పెళ్లై అత్తారింటికి వెళ్లినా పుట్టింటి వాళ్లు ఐదేళ్లకోసారి పిలిచి ఆప్యాయంగా ఒడిబియ్యం పోస్తారు. తెలంగాణ సహా కొన్ని తెలుగు ప్రాంతాల్లో ఈ ఒడిబియ్యం ఆచారం తెలిసిందే. కానీ అమ్మలగన్నమ్మ ఆ జగన్మాత కూడా పుట్టింటి వాళ్ల నుంచి ఒడిబియ్యం అందుకొనే ఆచారం ఉందని తెలుసా? అవును... శ్రీశైల భ్రమరాంబ ఉగాది రోజు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉంటున్న తన పుట్టింటివాళ్లు ఇచ్చే కొత్త బట్టలు, ఒడిబియ్యం అందుకుంటుంది. భ్రమరాంబకు కర్ణాటక, మహారాష్ట్ర వాళ్లు ఎలా పుట్టింటివాళ్లు అవుతారంటారా? దానికో కథ ఉంది. పూర్వం కర్ణాటకలోని మైసూర్‌ ప్రాంతాన్ని మహీసుర రాజ్యం అని పిలిచేవారు. దీన్ని మహీసుర అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప శైవభక్తుడు. ఆయనకు లేకలేక పుట్టిన ఆడపిల్లకు మల్లిక అనే పేరు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కూడా మల్లికార్జునుడినే దైవంగా, భర్తగా భావించింది. ఆయన్నే పెళ్లిచేసుకుంటానని పట్టుబట్టింది. తండ్రి ఎంత చెప్పినా వినకుండా శ్రీశైలం చేరుకుని స్వామికి సేవలు చేస్తూ ఆయనలో ఐక్యమైంది. దాంతో రాజుగారే కాదు ఆ రాజ్యంలో ప్రజలు కూడా మల్లికని సాక్షాత్తు భ్రమరాంబ అంశగా తమ ఆడపడుచుగా భావిస్తారు. ఒడిబియ్యం, చీర, మంగళసూత్రాలు, పసుపు కుంకుమలు ఇస్తారు. మల్లికార్జునుడుని అల్లుడిగా భావించి ప్రతి ఉగాదికీ కొత్తబట్టలు పెడతారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు కాలినడకన తరలివచ్చి శ్రీశైలం భ్రమరాంబను భక్తితో దర్శించుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్