పని సులువు చేసే గ్లిజరిన్‌!

గ్లిజరిన్‌నే గ్లిజరాల్‌ అని కూడా పిలుస్తారు.  కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వుల నుంచి తీసే నేచురల్‌ కాంపౌండ్‌ ఇది. పారదర్శకంగా ఉండే ఈ ద్రవానికి రంగూ, వాసనా ఉండదు.

Published : 10 Apr 2024 02:17 IST

గ్లిజరిన్‌నే గ్లిజరాల్‌ అని కూడా పిలుస్తారు.  కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వుల నుంచి తీసే నేచురల్‌ కాంపౌండ్‌ ఇది. పారదర్శకంగా ఉండే ఈ ద్రవానికి రంగూ, వాసనా ఉండదు. రుచిలో మాత్రం తియ్యగా ఉంటుంది. మరి దీంతో చాలా రకాల ప్రయోజనాలే ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా!

  • మేకప్‌ని తొలగించడానికి కఠిన రసాయనాలున్న రిమూవర్లకు బదులుగా గ్లిజరిన్‌ని వాడొచ్చు. ఇది సులువుగా తొలగించడమే కాదు. చర్మాన్నీ పొడిబారనివ్వదు.
  • పనిచేశాక తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవడం తప్పనిసరి. అయితే, డబ్బులు పెట్టి హ్యాండ్‌వాష్‌ కొనేబదులు మీరే దాన్ని   గ్లిజరిన్‌ సాయంతో తయారు చేయండి. మనం స్నానం చేయడానికి వాడే సబ్బు అరిగిపోయి చివర్లో చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతుంది. వాటిని పారేయకుండా సేకరించి ఓ డబ్బాలో వేయండి. అందులో కాసిన్ని నీళ్లు ఐదారు చుక్కల గ్లిజరిన్‌, రెండు చుక్కల లావెండర్‌ నూనె జతచేస్తే సరి... హ్యాండ్‌ వాష్‌ సిద్ధమైపోయినట్లే.
  • గ్లిజరిన్‌ని ఎక్కువగా బేబీ ప్రొడక్ట్స్‌లో వాడతారు. ఇది చర్మాన్నీ, జుట్టునీ మృదువుగా మారుస్తుంది. అంతేకాదు ఫేషియల్‌ క్లీనర్‌గానూ, తేమనందించే టోనర్‌గానూ ఉపయోగపడుతుంది.
  •  తాళంచెవి సరిగా పనిచేయకపోయినా, డబ్బాల మూతలు ఓ పట్టాన రాకపోయినా, చేతులకు గాజులు ఎక్కకపోయినా నూనె రాయడం సహజమే. దానికి బదులుగా ఈ సారి కాస్త గ్లిజరిన్‌ ప్రయత్నించండి. ఏ మాత్రం జిడ్డు లేకుండానే మీ పని ఎంత సులువుగా అయిపోతుందో చూడండి.
  • పూల పరిమళాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. అలంకరణలో కనువిందు చేస్తాయి. మరి ఇవి ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే మాత్రం వాటిని ఉంచే నీళ్లల్లో రెండు చుక్కల గ్లిజరిన్‌ కలిపి చూడండి.
  • పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్టిక్కర్లు, క్రేయాన్ల మరకలు, తలుపులూ, ఫ్రిజ్‌ల మీద గీతలూ, వేళ్ల ముద్రలూ ఇబ్బందిగా కనిపిస్తున్నాయా? దూదిపై కాస్త గ్లిజరిన్‌ వేసి రుద్దండి. ఇలా తరచూ చేస్తుంటే క్రమంగా పోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్