ఉయ్యాలా... జంపాలా...

బుజ్జాయికి కడుపునిండా పాలు తాగించి, ఊయలలో పడుకోబెట్టి అలా ఊపుతూ, జోల పాడుతుంటే క్షణాల్లో నిద్రలోకి జారుకుంటుంది కదా! ఊయల మహాత్మ్యం అలాంటిది మరి.

Published : 10 Apr 2024 02:18 IST

బుజ్జాయికి కడుపునిండా పాలు తాగించి, ఊయలలో పడుకోబెట్టి అలా ఊపుతూ, జోల పాడుతుంటే క్షణాల్లో నిద్రలోకి జారుకుంటుంది కదా! ఊయల మహాత్మ్యం అలాంటిది మరి. అయితే పెరిగేకొద్దీ ఆ సంతోషానికి మనం దూరమయ్యామన్నది నిజం. కానీ కనీసం అరగంటైనా సరే... ఊయలలో నిద్రించడం వల్ల మనం అద్భుత ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దానివల్ల మనం త్వరగా నిద్రలోకి జారుకోవడమే కాదు, నాణ్యమైన నిద్రతోపాటు, జ్ఞాపకశక్తీ పెరుగుతుందని ‘ది జర్నల్‌ ఆఫ్‌ స్లీప్‌ రిసెర్చ్‌’ అధ్యయనాలు చెబుతున్నాయి. అలా మన శరీరం మొత్తాన్ని ప్రకృతికి అప్పగించేసి ఊగుతూ ఉంటే, వీచే చల్లగాలి మనల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తుంది. లోలోపల దాగున్న ఆందోళనలూ, ఒత్తిళ్లన్నీ కాసేపట్లో ఎవరో చేత్తో తుడిచేసినట్లు మాయమైపోతాయి. అందుకే టూర్‌కి వెళ్లినప్పుడైనా లేదా ఇంటి పెరట్లో అయినా అలా మధ్యాహ్నం పూట కాసేపు ఓ కునుకు తీయడానికైనా చెట్ల మధ్య కట్టే హ్యామక్‌ లాంటి ఊయలలు చక్కగా సరిపోతాయి. పైగా వీటి కోసం పెద్ద పెద్ద సెటప్‌లు ఏమీ అవసరం లేదు. పడుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి మంచి నిద్ర పడుతుంది. ఆరుబయట కాబట్టి... ఆహ్లాదాన్నీ అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదో స్వర్గాన్ని తలపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... మనమూ అందులో విహరిద్దాం పదండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్