అల్పాహారంగా... అన్నం తినొచ్చా!

నా వయసు 25. నేను ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. అయితే నా పనివేళలు రాత్రుళ్లు కావడం వల్ల నేను ఉదయం 11గంటలకు నిద్రలేస్తాను. ఎటువంటి అల్పాహారం తీసుకోకుండా... ఒకేసారి మధ్యాహ్న భోజనం తింటాను.

Updated : 11 Apr 2024 17:29 IST

నా వయసు 25. నేను ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. అయితే నా పనివేళలు రాత్రుళ్లు కావడం వల్ల నేను ఉదయం 11గంటలకు నిద్రలేస్తాను. ఎటువంటి అల్పాహారం తీసుకోకుండా... ఒకేసారి మధ్యాహ్న భోజనం తింటాను. ఇలా అల్పాహారానికి బదులు భోజనం చేయడం మంచిదేనా? ఇలా చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా చెప్పగలరు.

దివ్య, శ్రీకాకుళం.

టెక్నాలజీ మారడం వల్ల కొన్ని రకాల పనివేళలకు తగినట్లు పనిచేయాల్సిన రోజులివి. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వాటిని పాటించక తప్పదు. ఇక మీ విషయానికి వస్తే... మీరు రాత్రి ఏ సమయంలో పనిచేస్తారు, ఎప్పుడు తింటారు అనేది చెప్పలేదు. అల్పాహారానికి బదులు మధ్యాహ్న భోజనం చేస్తున్నా అన్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. ఎందుకంటే ఏ సమయంలో తింటున్నాం అనేదానికన్నా ఎలాంటి పోషక భరితమైన ఆహారం తింటున్నారనేది ముఖ్యం. అంతేకాదు, మీరు తినే సమయం కొంచెం అటుఇటూ అయినా శరీరానికి అందించే పోషకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మధ్యాహ్న భోజనంలో దంపుడు బియ్యం, ఆకుకూరలు, పప్పు, పెరుగు వంటి పదార్థాలను తీసుకోండి. మీరు ఉదయం అల్పాహారంగా తినాల్సిన వాటిని సాయంత్రం స్నాక్స్‌లో చేర్చుకుంటూ గుగ్గిళ్లు, ఓట్స్‌, రాగి జావ, ఆమ్లెట్‌, జొన్నఇడ్లీ, పెసరట్టు, దోశ వంటివి కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. ఇక రాత్రికి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి తాజా పండ్లను సలాడ్స్‌గా 6 నుంచి 7 మధ్యలో తినండి. తరవాత రాగి, జొన్నపిండితో చేసిన చపాతీలను ఆకుకూరలతో తీసుకోండి. ఇవన్నీ మీ బరువుకు తగ్గ మోతాదులో తినండి. అంతేకాదు, నిద్రకు కనీసం ఎనిమిది గంటలు కేటాయించుకోండి. రాత్రివేళల్లో పనిచేస్తున్నారు కాబట్టి పగలు వ్యాయామాలు తప్పని సరిగా చేస్తూ బరువును అదుపులో ఉంచుకోండి. వారాంతాల్లో ఉదయం ఎండలో కాసేపు గడపండి. ఇలా ప్రణాళిక వేసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యాలూ రాకుండా పనిలో చురుగ్గా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్