ట్రెలిస్‌ ట్రెండ్‌ నడుస్తోంది...

ఒత్తిడీ, ఆందోళనలను దూరం చేయడానికి, ఏకాగ్రతని సాధించడానికీ ఇప్పటి మహిళల ముందున్న మార్గం తోటల పెంపకం. మిద్దె, వంటిల్లు, కార్యాలయాల్లో డెస్క్‌ల మీద తమకు నచ్చిన రీతిలో ఇష్టమైన మొక్కల్ని పెంచేస్తున్నారు.

Updated : 12 Apr 2024 05:06 IST

ఒత్తిడీ, ఆందోళనలను దూరం చేయడానికి, ఏకాగ్రతని సాధించడానికీ ఇప్పటి మహిళల ముందున్న మార్గం తోటల పెంపకం. మిద్దె, వంటిల్లు, కార్యాలయాల్లో డెస్క్‌ల మీద తమకు నచ్చిన రీతిలో ఇష్టమైన మొక్కల్ని పెంచేస్తున్నారు. అంతేకాదు తక్కువ స్థలంలో ఎక్కువ సాగు ఎలా చేయాలో తెలుసుకుంటూ కొత్త ట్రెండ్‌లను అనుకరిస్తున్నారు. దానిలో భాగంగా వచ్చిందే ట్రెలిస్‌..

ర్టికల్‌, గార్డెన్‌ బెడ్స్‌, వాల్‌ ప్లాంటింగ్‌ పద్ధతుల్ని దాటుకుంటూ ఇప్పుడు ట్రెలిస్‌ గార్డెనింగ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అంటే... కింద మట్టితో బెడ్‌లను ఏర్పాటు చేసుకొని, తీగలను పైన ఏర్పాటు చేసుకున్న నిచ్చెనలకు అందంగా పాకేలా చేయడం అన్నమాట. వినడానికి కొత్తగా ఉన్నా దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం. పైగా ఖర్చు కూడా తక్కువ. ఇంట్లో దొరికే చెక్కలతో, తాడులతో సృజనాత్మకంగా మనకు నచ్చిన ఆకారంలో తక్కువ స్థలంలోనే అందమైన తోటలను నిర్మించుకోవచ్చు.

తయారీ.. మనకు నచ్చిన వైశాల్యంలో గార్డెన్‌ బెడ్‌లను ఏర్పాటు చేసుకుని, ఆ మట్టిలో ఫోల్డింగ్‌ నిచ్చెనలు ఉంచితే సరి. బీర, టొమాటో, బెండ, కీర, దోస, కాకర లాంటి పాదులను వాటిపై పాకేలా వేస్తే తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటను పొందొచ్చు. చిన్నచిన్న వుడ్‌ హౌజ్‌లను, కంచెలను, చెక్కలను ఏర్పాటు చేసి వాటిని పురికొసలతో జోడిస్తే చాలు. మొక్కల పెంపకానికి అందమైన ఆకృతిని ఇచ్చిన వాళ్లమవుతాం. దీనంతటికీ కాస్త సమయం వెచ్చిస్తే చాలు మీ తోటలు నందన వనాన్ని తలపిస్తాయి. ప్రయత్నిస్తారు కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్