గాజుని సులువుగా మెరిపిద్దాం!

ఆరోగ్య స్పృహ, అలంకరణపై శ్రద్ధ...ఇంట్లో గాజు వస్తువుల వాడకాన్ని పెంచేశాయి. ఇవి చూడ్డానికి ఎంతందంగా ఉన్నా...  ఇవి ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోతే దుమ్ము, జిడ్డు వంటివాటితో మరకలు పడతాయి. అలాగని శుభ్రం చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా... అవి పగిలిపోతాయి.

Updated : 13 Apr 2024 01:49 IST

ఆరోగ్య స్పృహ, అలంకరణపై శ్రద్ధ...ఇంట్లో గాజు వస్తువుల వాడకాన్ని పెంచేశాయి. ఇవి చూడ్డానికి ఎంతందంగా ఉన్నా...  ఇవి ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోతే దుమ్ము, జిడ్డు వంటివాటితో మరకలు పడతాయి. అలాగని శుభ్రం చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా... అవి పగిలిపోతాయి. అలాకాకూడదంటే ఈ చిట్కాలు పాటించండి మరి.

  • గాజు వస్తువులను శుభ్రం చేసేటప్పుడు పీచుకి బదులు స్పాంజ్‌ని వాడాలి. దీన్ని వాడేందుకు సబ్బుకి బదులు లిక్విడ్‌ సోప్‌ ఎంచుకోవడం మంచిది. చేతులు పట్టని గాజు వస్తువుల్లోకి మెత్తటి ఫోమ్‌, లేదా కుచ్చుల బ్రష్‌తో శుభ్రపరిస్తే సరి.
  • గ్లాస్‌వేర్‌ని క్లీన్‌ చేయడానికి చన్నీళ్లకు బదులుగా వేడినీళ్లను వాడండి. ఇవి బ్యాక్టీరియాను సులువుగా తొలగిస్తాయి. గ్రీజు, జిడ్డు మరకల్ని త్వరగా వదలగొడతాయి.
  • కఠిన రసాయనాలతో కూడిన క్లీనర్లను గాజుపాత్రల్ని కడగడానికి వాడటం మంచిది కాదు. ఇవి వాటికుండే సహజమెరుపుని తగ్గిస్తాయి. బదులుగా వెనిగర్‌, నిమ్మ, బేకింగ్‌ సోడా వంటివి వినియోగించొచ్చు.  
  • గాజు పాత్రల్ని ఓసారి వేణ్నీళ్లలో శుభ్రపరిచి నిమ్మచెక్కలతో రుద్దితే దానిమీదే పేరుకున్న మురికి తొలగిపోతుంది. అంతేకాదు....ఆహారపదార్థాలు, తేనీటి వాసనలు, మరకలు వంటివీ దూరమవుతాయి. చివరిగా టూత్‌ పేస్ట్‌ని ఉపయోగించీ గాజు పాత్రల్ని శుభ్రపరచుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్