మినియేచర్‌ హ్యాంగర్‌లు...!

అందమైన ఇల్లు... గుమ్మానికి ఇరువైపులా లేసుల పరదాలతో కిటికీలు. ముంగిట విరబూసిన పూల మొక్కలు. అలాగే వేలాడే పూలగుత్తులు వెదజల్లుతున్న పరిమళంతో బాల్కనీ. సేదతీరడానికన్నట్లుగా సర్దిన కుషన్‌ కుర్చీలు. ఊహించుకుంటేనే మనసుకెంతో ఆహ్లాదంగా ఉంది కదూ...!

Published : 15 Apr 2024 02:10 IST

అందమైన ఇల్లు... గుమ్మానికి ఇరువైపులా లేసుల పరదాలతో కిటికీలు. ముంగిట విరబూసిన పూల మొక్కలు. అలాగే వేలాడే పూలగుత్తులు వెదజల్లుతున్న పరిమళంతో బాల్కనీ. సేదతీరడానికన్నట్లుగా సర్దిన కుషన్‌ కుర్చీలు. ఊహించుకుంటేనే మనసుకెంతో ఆహ్లాదంగా ఉంది కదూ...! కానీ... ఇవన్నీ సృజనాత్మకంగా చేసిన మినియేచర్‌ సెట్టింగ్‌లే. వీటితో అవసరానికి తగ్గట్లుగా, అలాగే ఇంటికి అందాన్నిచ్చేలా చేయొచ్చు. అదెలాగో చూద్దాం.

వృథా చెక్కలు, చెట్ల కొమ్మలు, అట్టముక్కలు, ఐస్‌క్రీము చెంచాలు, ప్లాస్టిక్‌ పూల గుత్తులు, వృథా వస్త్రం, రంగులు,  జిగురు వంటివి ఉంటే చాలు. కాస్త సృజనాత్మకత జోడిస్తే ఊహకు తగ్గట్లుగా ఇంటీరియర్‌, బాల్కనీ, వరండా వంటి మినియేచర్‌ సెట్టింగ్‌లను తయారుచేసుకోవచ్చు. గది గోడ వర్ణానికి తగిన రంగులనే మినియేచర్‌ బ్యాక్‌గ్రౌండ్‌కు వాడితే మంచిది. అలా చేసిన ఈ మినియేచర్‌ డిజైన్‌కు కిందగా చిన్నచిన్న హుక్‌లను ఫిక్స్‌ చేసి గోడకు తగిలించేలా ఏర్పాటు చేస్తే హ్యాంగర్‌గా మారుతుంది. దీనికి ఇంటి, వాహనాల తాళాలను తగిలించొచ్చు. అంతేనా... ఈ సౌకర్యంతోపాటు సహజంగా కనిపిస్తూ గదికి కొత్త ఆకర్షణనూ తెచ్చిపెడతాయి. అందమైన వాల్‌ డెకరేషన్‌గానూ కనిపిస్తాయి. ఈ ఆలోచన భలేగుంది కదూ. నచ్చితే మీరు కూడా మీ ఇంటి గోడలను మినియేచర్లతో రంగుల హరివిల్లుగా మార్చుకోవచ్చు. ప్రయత్నించండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్