పప్పులకు పురుగు పడుతుందా...

ఇంట్లో సరకులు నిండుకుంటాయని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బియ్యం, పప్పు ధాన్యాలు కొనేస్తుంటాం. అవి పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అయినా ఫలితం ఉండదు. ఇక ఇలా జరగకుండా కొన్ని చిట్కాలు.

Published : 15 Apr 2024 02:11 IST

ఇంట్లో సరకులు నిండుకుంటాయని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బియ్యం, పప్పు ధాన్యాలు కొనేస్తుంటాం. అవి పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అయినా ఫలితం ఉండదు. ఇక ఇలా జరగకుండా కొన్ని చిట్కాలు...

ఎక్కువ మొత్తంలో పప్పు ధాన్యాలు నిల్వ చేయాలనుకుంటే, డబ్బా అడుగు భాగంలో కొన్ని ఎండిన వేప ఆకులను వేసి పప్పులను నింపండి. వేప క్రిమినాశిని కాబట్టి పప్పులు పురుగు పట్టవు.

  • పప్పు నిల్వ చేసే డబ్బాల్లో మూడు నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగులు చేరవు.
  • పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే.. ఐదారు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను ఆ సీసాల్లో వేయండి. వాటిని ఎండిపోయే వరకూ ఉంచి... తరవాత బయటకు తీసేసి కొత్తవి ఉంచండి.  
  • అయిదారు లవంగాలను పప్పుల డబ్బాలో పెట్టి...గాలి తగలకుండా మూత బిగిస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్