శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!

భగవంతునిపై తమకున్న భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. తెలంగాణలోని గద్వాల పట్టణానికి చెందిన ఇల్లూరి శ్రీలక్ష్మి తత్త్వం మరింత ప్రత్యేకం.

Published : 17 Apr 2024 00:12 IST

గవంతునిపై తమకున్న భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. తెలంగాణలోని గద్వాల పట్టణానికి చెందిన ఇల్లూరి శ్రీలక్ష్మి తత్త్వం మరింత ప్రత్యేకం. శ్రీరామ నవమి వస్తోందంటే చాలు... ఆమెకి ఎక్కడి లేని సంతోషం! ఎందుకంటే గత పదేళ్లుగా...శ్రీరామ నామాన్ని బియ్యపు గింజలపై రాసి నవమి నాటికి భద్రాచలం రాములోరి కల్యాణోత్సవం కోసం పంపుతారామె. ఎంతో ఇష్టంగా నేర్చుకున్న సూక్ష్మ చిత్రకళతో తన భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. ఇరవై రోజులకు పైగా శ్రమించి ఎంతో నిష్ఠగా శ్రీరామ నామాన్ని లిఖిస్తారు శ్రీలక్ష్మి. అలాగని అవి ఏ పదో, వందో ఉంటాయనుకోకండి. ఏటా అక్షరాలా 10,116 బియ్యపు గింజలను సిద్ధం చేస్తారు. వాటిని భద్రాచలంలో శ్రీరామకల్యాణ ఉత్సవాల్లో తలంబ్రాల్లో వినియోగించేందుకు పంపుతారు. ఇలా ఇప్పటివరకూ శ్రీరామ నామాన్ని 4.50 లక్షల బియ్యపు గింజలపై రాశారు. మొన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకూ...పంపించారట. ఈ పనిచేయడాన్ని శ్రమగా కంటే... అదృష్టంగా భావిస్తున్నా అంటారు శ్రీలక్ష్మి.

టీఎన్‌ మూర్తి, గద్వాల

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్