వంటిల్లు పొందిగ్గా

ఇంటి అలంకరణ అంటే... హాలు, వరండా, పడకగది, బాల్కనీ మాత్రమే కాదు... వంటగది కూడా. ఎందుకంటే ఆడవాళ్లు ఎక్కువ సేపు గడిపేది అక్కడే. కాస్త ఆలోచిస్తే అందంగానే కాదు, సౌకర్యంగానూ మార్చుకోవచ్చు. అప్పుడే వంట శుచిగా, శుభ్రంగానే కాదు... మనమూ ఆరోగ్యంగా ఉండొచ్చు.

Published : 19 Apr 2024 01:57 IST

ఇంటి అలంకరణ అంటే... హాలు, వరండా, పడకగది, బాల్కనీ మాత్రమే కాదు... వంటగది కూడా. ఎందుకంటే ఆడవాళ్లు ఎక్కువ సేపు గడిపేది అక్కడే. కాస్త ఆలోచిస్తే అందంగానే కాదు, సౌకర్యంగానూ మార్చుకోవచ్చు. అప్పుడే వంట శుచిగా, శుభ్రంగానే కాదు... మనమూ ఆరోగ్యంగా ఉండొచ్చు.

  • వంటగదిలో గోడల రంగుల గురించి పెద్దగా పట్టించుకోం. కానీ, గ్రాస్‌గ్రీన్‌, లేత పసుపు, గ్రే, బ్రీజీ బ్లూ, సాఫ్ట్‌గ్రే వంటివి ఎంచుకుంటే... మనసుకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. గది చిన్నగా ఉన్నా విశాలంగా అనిపిస్తుంది. ఇక్కడ వాల్‌ ఆర్ట్‌ అంతగా నప్పదు.
  • వంట సామాన్లు ఎన్ని ఉన్నా... అవసరానికి ఏదో వెలితిగానే అనిపిస్తుంది. అలాగని ఇల్లంతా వస్తువులతో నింపేయకండి. ఎప్పుడో ఒకసారి వాడే పాత్రల్ని అక్కడి నుంచి తరలించి మరో చోట సర్దండి. పారదర్శకంగా ఉండే కంటైనర్లలో పోస్తే ఏ పప్పు ఎక్కడుందో ఇట్టే తీసుకోవచ్చు. అలానే మీరు వినియోగించే పదార్థాల పరిమాణాన్ని బట్టి వాటికి అవసరమైన డబ్బాలను ఎంచుకుంటే స్థలం సరిపోవడం లేదనే సమస్య ఉండదు.
  • ఇక, ఇప్పుడు పనిని సులువు చేసే మార్గాలెన్నో ఉన్నాయి. ఇందుకోసం గ్యాసు వెనక గోడపై జిడ్డు చేరకుండా లింట్‌ ఫ్రీ షీట్స్‌ దొరుకుతున్నాయి. వాటిని వేసుకుంటే త్వరగా శుభ్రం చేసేయొచ్చు. అలానే, షెల్ఫ్‌ ర్యాకుల్లో వేసుకునేందుకు, ఆయిల్‌, వాటర్‌ ఫ్రీ పేపర్స్‌ని ఎంచుకోండి. ఇవి అందంగా కనిపించడమే కాదు... తరచూ మార్చాల్సిన అవసరమూ ఉండదు. టీ, కాఫీ పొడులూ, పంచదార వంటివాటితో పాటు పచ్చళ్లు, మసాలాలు వంటివాటిని వేటికవే విడిగా పెట్టే బదులు ఆర్గనైజింగ్‌ ట్రేల్లో పెట్టేస్తే సరి. అవసరమైనప్పుడు అన్నీ ఒకే చోట దొరికేస్తాయి. ఒద్దికగానూ ఉంటాయి.
  • వంట గదికి ఆనుకుని బాల్కనీ ఉంటే.. అక్కడ చిన్నచిన్న కుండీల్లో మనకు కావాల్సిన కొత్తిమీర, పాలకూర, పుదీనా వంటి మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇవి వేగంగా పెరుగుతాయి.  తాజా ఆకులు వంటకాలకు రుచినీ పెంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్