ఈ బాక్సులు బుజ్జాయిలకెంతో ఇష్టం..!

‘ఇంట్లో ఎవరికీ తెలియకుండా రహస్యాన్ని అక్క చెవిలో వినిపించాలి. ఎటువంటి ఆటంకం లేకుండా నచ్చిన బొమ్మలతో కాసేపు ఒంటరిగా ఆడుకోవాలి. ఇష్టమైన కథల పుస్తకాన్ని తమ్ముడు చూడకుండా చదువుకోవాలి’ అనుకునే బుజ్జాయిలకు ఇంట్లో ఈ హైడింగ్‌ బాక్సు లేదా ప్లేహౌస్‌ ఉంటే చాలు.

Published : 21 Apr 2024 01:59 IST

‘ఇంట్లో ఎవరికీ తెలియకుండా రహస్యాన్ని అక్క చెవిలో వినిపించాలి. ఎటువంటి ఆటంకం లేకుండా నచ్చిన బొమ్మలతో కాసేపు ఒంటరిగా ఆడుకోవాలి. ఇష్టమైన కథల పుస్తకాన్ని తమ్ముడు చూడకుండా చదువుకోవాలి’ అనుకునే బుజ్జాయిలకు ఇంట్లో ఈ హైడింగ్‌ బాక్సు లేదా ప్లేహౌస్‌ ఉంటే చాలు. వారి సంతోషానికి అవధులే ఉండవు. ముద్దుగా చిన్న కుటీరంలా అనిపిస్తూ...పిల్లల మనసుకు ప్రశాంతతనూ అందిస్తాయి.

పల్చని చెక్క లేదా తేలికైన ప్లైవుడ్‌తో రెండడుగులెత్తులో వీటిని తయారుచేస్తున్నారు. పిల్లలు లోపలకెళ్లి కూర్చోవడానికి వీలుగా ఒకవైపు లేదా రెండువైపులా ఓపెన్‌, లోపల కుషన్‌ ఏర్పాటుతోపాటు, బాక్సు లోపలి గోడకు రెండు మూడు అలమరలతో అందంగా రూపొందిస్తున్నారు. తమ బొమ్మలు, పుస్తకాలను పిల్లలు ఈ బుల్లి గదిలో భద్రపరుచుకోవచ్చు. కిటికీ లుక్‌ వచ్చేలా గుండ్రని రంధ్రాలతో ఇవి సహజమైన ఇళ్లుగానూ అనిపిస్తున్నాయి. అంతేకాదు, ఒకేసారి ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి ఆడుకునేలా రెండు మూడు గదులుండేలా కూడా వస్తున్నాయి. అలాగే ట్రీహౌస్‌ పేరుతో వస్తున్న కొన్ని రకాలు పిల్లలకు చెట్లమధ్య ఉన్న అనుభూతినిస్తున్నాయి. మరికొన్ని కావాల్సిన చోటుకు తరలించేలా వీల్స్‌ సౌకర్యంతో ఉంటున్నాయి. తమకంటూ ప్రత్యేకంగా ఓ చోటు ఉందనే భావనను, ఏకాగ్రతనూ పిల్లల్లో పెంచుతున్న ఈ మ్యాజిక్‌ బాక్సులను మీ బుజ్జాయిల కోసం మార్కెట్‌ నుంచి మీరూ ఇంటికి తెచ్చేస్తారా..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్