పొందికగా... సర్దేయొచ్చు!

కబోర్డులను ఎంతైనా సర్దండి. హడావుడిగా తీయడం వల్లో, అమరిక కుదరకో చిందరవందరగా మారిపోతుంటాయి. వాటిని తిరిగి సర్దడం పెద్ద పని! ఇవి తెచ్చుకోండి... ఆ బెంగ తీర్చేస్తాయ్‌! రోజువారీ అవసరాలకు... పార్టీలు, విహారాలకు అంటూ రకరకాల బ్యాగులు కొనేస్తుంటాం. అవేమో కబోర్డుల్లో చాలా స్థలాన్ని ఆక్రమిస్తుంటాయి.

Published : 22 Apr 2024 01:45 IST

స్వీట్‌ హోమ్‌

కబోర్డులను ఎంతైనా సర్దండి. హడావుడిగా తీయడం వల్లో, అమరిక కుదరకో చిందరవందరగా మారిపోతుంటాయి. వాటిని తిరిగి సర్దడం పెద్ద పని! ఇవి తెచ్చుకోండి... ఆ బెంగ తీర్చేస్తాయ్‌!

స్థలం ఆదా...

రోజువారీ అవసరాలకు... పార్టీలు, విహారాలకు అంటూ రకరకాల బ్యాగులు కొనేస్తుంటాం. అవేమో కబోర్డుల్లో చాలా స్థలాన్ని ఆక్రమిస్తుంటాయి. ఒకదాన్ని కదిలిస్తే మిగిలినవీ పడిపోయే సందర్భాలెన్నో. బయట పెడదామంటేనేమో దుమ్ము భయం. ఈ తిప్పలకు చెక్‌ పెడుతూ వచ్చినవే ఈ హాండ్‌బ్యాగ్‌ హ్యాంగర్‌ ర్యాక్‌లు. వీటిని కబోర్డులో రాడ్‌కి వేలాడదీసి, ఇరువైపులా బ్యాగులను తగిలిస్తే సరి. అందంగానూ కనిపిస్తాయి. స్థలమూ వృథా కాదు. పడిపోతాయన్న బెంగ అసలే ఉండదు.


చిన్నవీ... చక్కగా!

పిల్లల దుస్తులు ఉండటానికి చిన్నగా, ముద్దుగా ఉంటాయి కానీ అవి పెట్టే తిప్పలు మామూలుగా ఉండవు. ముఖ్యంగా వాళ్ల సాక్సులు, ఇన్నర్‌వేర్‌ల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఓ పట్టాన దొరకవు. వెతికే క్రమంలో మిగతావన్నీ చిందరవందర అయిపోతాయి. మన లోదుస్తుల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఓ పట్టాన కబోర్డులో అమరవు. పైగా పడిపోతుంటాయి. ఈ వార్డ్‌రోబ్‌ అడ్జస్టబుల్‌ స్టోరేజ్‌ డ్రాయర్‌లను తెచ్చుకోండి. కబోర్డు తలుపునకో, లోపలి గోడకో అతికిస్తే సరి. హ్యాండిల్‌ని పట్టి, లాగితే చిన్న అరలుంటాయి. వాటిలో ఇన్నర్‌వేర్‌, కర్చీఫ్‌లు, సాక్సులు వంటివి సర్దేయండి. తేలిగ్గా తీసుకోవచ్చు.


ఇస్త్రీ చెదరదు

క్కగా ఇస్త్రీ చేయించి, శ్రీవారి దుస్తులు సర్దుతామా? ఏ మధ్యలోదో కావాలని లాగుతారా కిందవీ పైవన్నీ ఉండలా చుట్టుకుపోతాయి. అలాకాకుండా ఉండాలంటే ఫోల్డబుల్‌ అండ్‌ స్టాకబుల్‌ క్లోజెట్‌ డ్రాయర్‌ ప్రయత్నించండి. అరలవారీగా ఉంటుంది. దానిలో షర్టులు, ప్యాంటులను సర్దితే సరి. కావాల్సిన అరని బయటికి లాగి నచ్చినదాన్ని తీసుకోవచ్చు. బాగున్నాయి కదూ! తగినవేంటో చూసుకొని, ఇంటికి తెచ్చేసుకోండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్