ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...

నాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఆరు నెలల బాబు. నా భర్త ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి. చాలా కోపిష్టి, మొండివాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. నేను సంప్రదాయ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాను. ఇన్నేళ్లూ అతన్ని భరించాను. అతని నుంచి విడాకులు తీసుకుంటే కుటుంబం పరువు పోతుందేమో అని ఆలోచిస్తున్నా.

Published : 29 Apr 2024 18:38 IST

నాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఆరు నెలల బాబు. నా భర్త ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి. చాలా కోపిష్టి, మొండివాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. నేను సంప్రదాయ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాను. ఇన్నేళ్లూ అతన్ని భరించాను. అతని నుంచి విడాకులు తీసుకుంటే కుటుంబం పరువు పోతుందేమో అని ఆలోచిస్తున్నా. చిన్న చిన్న విషయాలకూ నాపై కోపం చూపించి, బాబుని తన కస్టడీలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కెరియర్‌, డబ్బు, హోదా అన్ని విధాలుగా తనకంటే మెరుగ్గానే ఉన్నా. ఈ బంధంలో ఉండాలో లేదో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు. 

- ఓ సోదరి

మీ భర్త పెళ్లయిన మొదటి నుంచీ ఇదే ప్రవర్తనతో ఉన్నారా లేక ఈమధ్య కాలంలోనే ఇలా మొండిగా మారారా అనేది తెలియడం లేదు. పిల్లవాడిపై ప్రేమను చూపించడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయంటే... ముందు మీ రెండు కుటుంబాలతో మాట్లాడి అటువంటివి జరగకుండా చూసుకోవాలి.  ఏది ఎలా ఉన్నా లీగల్‌గా బాబు పెద్దయ్యే వరకూ తల్లి సంరక్షణలోనే ఉండాలి. మీరు దాని గురించి ఆలోచించి బాధపడనవసరం లేదు. అతనితో మాట్లాడి ప్రవర్తనలో మార్పు తేవొచ్చేమో ప్రయత్నించండి. ఈ మధ్యకాలంలోనే అతని ప్రవర్తనలో మార్పు వచ్చి ఉంటే ఓసారి సైకాలజిస్ట్‌ను కలవండి. మానసిక వ్యాధులు ఏమైనా ఉంటే మందుల ద్వారా అతనిలో మార్పు తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తారు. లేదా అతని వ్యక్తిత్వమే అలా ఉంటే మీ ఇద్దరికీ మ్యారిటల్‌ కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండేలా, మీపట్ల వ్యవహారశైలి ఎలా ఉండాలన్నది తనకి తెలియజేస్తారు. మీకూ అతని ప్రవర్తనపై అపోహలూ, భయాలు ఏమైనా ఉంటే పోగొడతారు. మీరు అన్ని విషయాల్లో అతని కంటే బాగానే ఉన్నారు కాబట్టి, పిల్లవాడిని పెంచడానికి ఇబ్బంది లేదు. ఇటువంటి పరిస్థితులకు అధైర్యపడకుండా ఉండండి. ఓసారి పెద్దవాళ్లతోనూ మీ సమస్యను చర్చించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్